Dont divide andhra pradesh kiran

dont divide Andhra Pradesh, Chief Minister Kiran Reddy, separate Telangana state, Chief Minister Kiran Kumar Reddy

As the Centre works on the roadmap for a separate Telangana state, a faction with the ruling Congress is making last ditch efforts to stop the division of Andhra Pradesh - among them Chief Minister Kiran Kumar Reddy.

నా చేతులతో ఆ ఘోరం చేయలేను

Posted: 08/06/2013 09:07 AM IST
Dont divide andhra pradesh kiran

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పై ఎన్నో కమిటీలు, కోర్ కమిటీ భేటీలు వేసి చివరకు చివరకు సీడబ్ల్యూసీలో తెలంగాణ ఏర్పాటు పై నిర్ణయం తీసుకోవడం.. ఈ పరిణామాలన్నింటిలో ముఖ్యమంత్రి కిరణ్ కి తెలిసే జరిగాయి. అయితే అధిష్టానానికి పలు విధాలుగా నచ్చజెప్పిన కిరణ్ రాష్ట్రాన్ని విభజిస్తే అనేక నష్టాలు ఉంటాయని, విభజన వల్ల ఒక ప్రాంతంలో పార్టీ బలపడితే మరో ప్రాంతంలో పార్టీ బలహీనపడుతుందని చెప్పినా వినకుండా అధిష్టానం తనపనితాను చేసుకొని పోయింది. ఆ ప్రకటనే ఇప్పుడు కిరణ్ కి పెద్ద తలనొప్పులు తెచ్చుపెడుతుంది. ప్రకటన వెలువడినప్పటి నుండి సచివాలయానికే పరిమితం అయిన కిరణ్ అక్కడి నుండి సీమాంద్ర మంత్రులతో మీటింగులు, పాలనా వ్యవహారాలను చూస్తున్నారు. సీమాంధ్ర సెగలో కిరణ్ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో నిన్న రాత్రి కొంత మంది సీమాంద్ర ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కిరణ్ తన గోడును వెల్లబోసుకున్నట్లు సమాచారం. 50 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రిని అయ్యాను. నా జీవితంలో ఇంతకంటే ఉన్నతస్థాయికి వెళ్లకపోయినా పర్వాలేదు. కానీ... ఈ ఘోరమైన వ్యవహారం (రాష్ట్ర విభజన) నా చేతుల మీదుగా నడిపించేందుకు సిద్ధంగా లేను. శక్తిమేరకు ఎదుర్కొంటాను. ఈ దశలో నా పదవి పోయినా ఫర్వాలేదు అని కిరణ్ చెప్పినట్లు సమాచారం.ఏది ఏమైనా పార్టీని బలోపేతం చేయడానికి అందరు పాటు పడాలని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles