Mp vijayashanthi hot comment on kcr

mp vijayashanthi hot comment on kcr, vijayashanthi fire on kcr, telangana issue, telangana state, telangana movement, telangana state division, ramulamma fire kcr, trs party, 2014 election, trs party 2014 election ten seats,

mp vijayashanthi hot comment on kcr

అన్న పార్టీ సీక్రెట్స్ చెప్పిన రాములమ్మ

Posted: 08/05/2013 07:04 PM IST
Mp vijayashanthi hot comment on kcr

తల్లి తెలంగాణ పార్టీ పెట్టి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేసి, అన్న చెల్లెల్లు కలిసిపోయిన కేసిఆర్, విజయశాంతిలు గత వారంలో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే అన్న పార్టీలో ఉన్నంత కాలంలో.. అన్నకు సపోర్టుగా రాములమ్మ వెలిగింది. కానీ ఇద్దరు విడిపోయిన తరువాత అన్న చేసిన నేరాలు ఘోరాలను రాములమ్మ మీడియా ముందు పెట్టేందుకు సిద్దమవుతుంది. ఈ రోజు రాములమ్మ మాట్లాడుతూ.. అన్న పార్టీ రాబోయే 2014 ఎన్నికల్లో పది సీట్లు మించి రావని మెదక్ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఉద్యమంలో క్రెడిట్ అంతా కేసీఆర్ అంటే తాను ఒప్పుకోనని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నడవడానికి అనేక మంది తెలంగాణ వాదులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు షోకాజ్ నోటీస్ అందిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని విజయశాంతి తెలిపారు. తెలంగాణ సాధన టీఆర్‌ఎస్ గొప్పదనమే అని చెప్పకపోగా, తెలంగాణ అమరవీరులదే ఆ ఘనత అని విజయశాంతి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. టీఆర్‌ఎస్ అధినాయకత్వంతో ఆమెకు దూరం పెరిగిందనేది స్పష్టమవుతోంది. కాగా తెలంగాణ ఏర్పాటుకోసం టీఆర్‌ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానని గతంలోనే ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఘనత ఏ రాజకీయపార్టీదో కాదని, ప్రాణాలను అర్పించిన అమరవీరులదే అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరికొన్ని విషయాలను త్వరలో బయట పెడతానని రాములమ్మ చెప్పటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles