Konda surekha gives ultimatum to vijayamma

Konda Surekha gives ultimatum to Vijayamma, Konda Surekha gives ultimatum to ysr congress party, YSR Congress aspirant Konda Surekha

Konda Surekha gives ultimatum to Vijayamma

వెనక్కి తగ్గని 'కొండా'- పార్టీ నుంచి తప్పుకుంటా?

Posted: 07/27/2013 07:18 PM IST
Konda surekha gives ultimatum to vijayamma

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామాలు చిచ్చు రేపుతున్నాయి. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత కొండా సురేఖ, విజయలక్ష్మితో భేటి అయ్యారు. విభజన అంశంపై అధినాయకత్వం నిర్ణయం ప్రకటించాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పావులు కావద్దని కొండా సురేఖ సూచించిన సంగతి తెలిసిందే. రాజీనామాలపై పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి వివరణనివ్వాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ను వ్యతిరేకించే పార్టీలో ఉండబోనని వైకాపా ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామని, అయితే దీనిపై విజయలక్ష్మీ నుంచి ఇంకా స్పందన రాలేదని ఆమె తెలిపారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles