Tdp for regional parties alliance

Telugu Desam Party, Samajwadi party, Mulayam Singh Yadav, Akhilesh Yadav, Devabrat Viswas, Chandra Babu Naidu, Congress Party, Telugu Desam party, Forward Block

tdp for regional parties alliance

సమాజ్ వాదితో కలవటానికి తెదేపా సిద్ధం

Posted: 07/22/2013 11:06 AM IST
Tdp for regional parties alliance

సమాజ్ వాది పార్టీతో కలవటానికి తెలుగు దేశం పార్టీ సిద్ధంగా ఉందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలియజేసారు.  కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గిపోయిందని, భారతీయ జనతా పార్టీ పుంజుకోలేకపోయిందని, అందువలన ఆ రెండు పార్టీలకూ తగినంత మెజారిటీ రాదని అందువలన భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని నడిపిస్తుందని అన్నారాయన.

అయితే నిన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో జరిగిన భేటీ కేవలం తమ పార్టీకి ములాయమ్ సింగ్ యాదవ్ తో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని జరిగిందని, చర్చల్లో ప్రధానంగా దేశ రాజకీయాలు, ఎన్నికల ప్రభావం, ఎన్నికల ముందు కాని ఆ తర్వాత కాని పార్టీల కలయికల గురించిన మాటలు వచ్చాయని చంద్రబాబు అన్నారు.

ఫార్వర్డ్ బ్లాక్ లీడర్ దేవబ్రత్ విశ్వాస్ కూడా నిన్నమధ్యాహ్నం చంద్రబాబు భేటీ అయ్యారు.  ఆయన దేశంలోని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చెలరేగుతున్న అవినీతి గురించి మాట్లాడుతూ, చంద్రబాబుని దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగట్టే బాధ్యతను భుజాన వేసుకోమని కోరారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles