Tg venkatesh demandede new state

Minister TG Venkatesh comments on Telangana, TG Venkatesh demandede new State, Rayalaseema State Hyderabad, breaking news,

"Minor Irrigation Minister TG Venkatesh on Saturday came out with a new suggestion that could trigger a fresh debate over Telangana issue

కొత్త డిమాండ్ ని తెర పైకి తెచ్చిన టీజీ

Posted: 07/22/2013 08:54 AM IST
Tg venkatesh demandede new state

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అప్పడప్పుడు తెలంగాణ విషయంలో చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో తెలంగాణ విషయంలో ఎన్నో జ్యోష్యాలు టీజీ తాజాగా కొత్త డిమాండ్ ను తెర పైకి తెచ్చారు. కోస్తాలోని రెండు జిల్లాలు మాత్రమే కాకుండా మహబూబ్ నగర్ లోని కొంత భాగాన్ని కూడా కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని అంటున్నారు. అంతే కాకుండా ఒకవేళ రాష్ట్ర విభజన జరపవలసి వస్తే రాయల సీమ జిల్లాలతో నెల్లూరు, ప్రకాశం, గద్వాల, ఆలంపూర్ కలిపి గ్రేటర్ రాయలసీమగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశం వరద కన్నా పెద్ద ఉపద్రవమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇస్తున్నామని ఆశ పుట్టిస్తుందే తప్ప తెలంగాణ పై నిర్ణయం మాత్రం తీసుకోలేదని, తెలంగాణ ఇస్తున్నట్లు కాంగ్రెస్ చెప్పలేదని అన్నారు. ప్రభుత్వం తెలంగాణ ఇస్తోందని ప్రచారం జరుగుతున్నా సీమాంధ్ర ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదని టీజీ వెంకటేష్ అన్నారు. అంటే మంత్రి పదవిలో ఉన్న వెంకటేష్ పరోక్ష వ్యాఖ్యలతో సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని భావించవచ్చా ? ఒక మంత్రి పదవిలో ఉన్న టీజీ ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles