Heavy rains cut connections between villages

heavy rains in AP, villages isolated in rains. Rains in many places in AP, Connections between villages strained, Singareni open cast mining, Coal production affected

heavy rains cut connections between villages

రాష్ట్రంలో భారీ వర్షాలతో ఇక్కట్లు

Posted: 07/17/2013 11:06 AM IST
Heavy rains cut connections between villages

రాష్ట్రంలో ఒకరోజు తెరపి తర్వాత మళ్ళీ పుంజుకున్న వర్షాల వలన చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.  నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన వంద గ్రామలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి.

నిజామాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమై అక్కడి నివాసులకు ఇక్కట్లు కలిగిస్తున్నాయి.  అదిలాబాద్ లో పెన్ గంగ ఉధృతమై గ్రామాలను, వాటి మధ్య రోడ్లను నీట ముంచివేసింది.  వేలాది ఎకరాల పంటను కూడా నాశనం చేసింది.

నల్గొండ జిల్లాలో మూసీ నది పొంది పొరలుతోంది.  నీటి ప్రాజెక్టలలో కూడా వరద నీరు చేరుకుని నీటి మట్టాన్ని పెంచేస్తోంది.  వాగులు పొంగి గోదావరిలో కలవటం వలన గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.

వీటన్నిటితో పాటు ఓపెన్ కాస్టింగ్ లలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వస్తున్న సింగరేణి బొగ్గు గనులలో వర్షాపాతం వలన బొగ్గు తవ్వకాలు నిలిచిపోతున్నాయి.  దానితో ఉత్పాదన ఆగిపోయి భవిష్యత్తులో విద్యుదుత్పాదనలో కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles