Bunch of pils rejected by sc on juvenile s age limit

PILs on juvenile age rejected. SC rejects reducing juvenile's age limit, Supreme Court of India, Chief Justice Altamas Kabir, Gangrape in Delhi

Bunch of PILs rejected by SC on juvenile's age limit

ఊకుమ్మడిగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల తిరస్కరణ

Posted: 07/17/2013 02:28 PM IST
Bunch of pils rejected by sc on juvenile s age limit

బాల నేరస్తుల వయో పరిమితిని 18 నుంచి 16కి తగ్గించమని కోరుతూ వచ్చిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలనన్నిటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. 

దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి అల్టామస్ కబీర్ నేతృత్వంలో ధర్మాసనం జువెనైల్ జస్టిస్ చట్టాన్ని సమర్థిస్తామని, ఆ చట్ట సవరణలో జోక్యం చేసుకోబోమని తెలియజేస్తూ ఆ పిటిషన్లన్నిటినీ తిరస్కిరించింది.

డిసెంబరు 16న ఢిల్లీలో వైద్య విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారంలో ఒక మైనర్ కూడా ఉండటంతో అతన్ని జువెనైల్ జస్టిస్ బోర్డు ఆధీనంలో ఉంచటం జరిగింది.  17 సంవత్సరాల మైనర్ కూడా సామూహిక అత్యాచారంలో ఉండటం వలన, చట్టంలోని ఒక చిన్న అంశంతో శిక్ష నుంచి తప్పించకునే అవకాశం ఉంది కాబట్టి 18 సంవత్సరాలు కాకుండా వయోపరిమితిని 16 సంవత్సరాలకు కుదించవలసిందిగా కోరుతూ ఎన్నో పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి.  వాటన్నిటినీ సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించింది. 

ఈ వ్యాజ్యాలను నిరసిస్తూ ఎన్నో బాలల సంరక్షణ సంఘాలన్నీ చట్టంలోని సవరణకు వ్యతిరేకతను తెలియజేసాయి.  రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు దేశంలోని జడ్జిలందరికీ జువెనైల్ కేసుల విషయంలో మార్గదర్శకాలను కూడా అందజేసింది.  అందులో, జువైనెల్ ని ఇతర ఖైదీలలాగా శిక్షించే అధికారం కోర్టులకు లేదని, కేవలం జవెనైల్ జస్టిస్ బోర్డు ఆధ్వర్యంలో వారివలన జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇప్పించవచ్చును కానీ శిక్షలను అమలు చెయ్యరాదని నిర్దేశించింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles