Digvijay singh rejects core group talks

digvijay singh, congress, telangana

The Congress Andhra Pradesh affairs incharge Digvijay Singh has rejected rebeal the core group meeting details on Telangana issue

అవన్నీ పుకార్లే అంటున్న దిగ్గీ

Posted: 07/16/2013 09:00 PM IST
Digvijay singh rejects core group talks

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ ఈ రోజు ఢిల్లీలో గుంటూరు జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, రాష్ట్ర మంత్రి మాణిక్యవర ప్రసాద్  పాటు పలువురు సీమాంధ్ర నేతలను తో భేటి అయ్యారు. ఈ భేటి అనంతరం దిగ్విజయ్ మాట్లాడుతూ... తెలంగాణ అంశాన్ని త్వరలోనే తేలుస్తామని, అది 2014 ఎన్నికల ముందుగానే ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తామని, హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా చేసే ఆలోచన లేదనే సమాచారాన్ని ఇచ్చారు. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాలకు చెందిన నేతల వాదనలు బలంగా ఉన్నాయని దిగ్విజయ్ అన్నారు. కోర్ కమిటీలో జరిగిన విషయాల పై అడిగితే.... అందులో చర్చింన విషయాలు బయటికి చెప్పలేనని, ఉమ్మడి రాజధాని పై వస్తున్న పుకార్ల పై కూడా తాను స్పందించనని అన్నారు. కోర్ కమిటీ విషయాలు అంతర్గత విషయాలని వాటి పై ఏమి అడగవద్దని అన్నారు. మరి దిగ్విజయ్ సింగ్ మాటలను బట్టి చూస్తుంటే అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం తెలుస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles