Panchayat elections hype

Panchayat elections hype in AP, 3 stage Panchayat elections, 21441 panchayats in AP, 129005 sarpanch contestants,

panchayat elections hype

పంచాయితీ పోటీలు హోరాహోరీ

Posted: 07/15/2013 10:17 AM IST
Panchayat elections hype

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేడి బాగా రాజుకుంది.  మూడు విడతలుగా జరుగనున్న పంచాయితీ ఎన్నికలలో నిజానికి రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదు కానీ అక్కడక్కడా అటువంటి సంఘటనలు, సర్పంచ్ గద్దెకు వేలం వెయ్యటాలు జరిగాయి.  కొన్ని చోట్ల లాటరీ పద్ధతిలో సర్పంచ్ ల నియామకాలు అనధికారికంగా జరిగిపోయాయి.

రాష్ట్రంలోని మొత్తం 21441 పంచాయితీల్లో సర్పంచ్ పదవికి పోటీ చెయ్యటానికి ఎన్నికల బరిలో ఉన్నవారి సంఖ్య 129005 అంటూ ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది.  వార్డు సభ్యత్వాలకు పోటీ చేస్తున్నవారు 566446 మంది.  సగటున చూస్తే ప్రతి పంచాయితీకి సర్పంచ్ పదవికోసం 6 గురు పోటీ చేస్తుంటే, వార్డు సభ్యులు మూడు వరకే ఉన్నారు. 

కరీంనగర్ జిల్లాలో ఎక్కువ పోటీ కనిపిస్తోంది.  ఈ జిల్లాలో గరిష్ట స్థాయిలో 7.76 శాతం పోటీ చేస్తున్నారు.  తక్కువ పోటీ శ్రీకాకుళం జిల్లాలో 4.98 గా కనిపిస్తోంది. 

జూలై 23, 27, 31 తేదీల్లో మూడు విడతలు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే అన్ని ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles