Trs party will supports rayala telangana

trs party u turn to telanagana, trs party will supports rayala telangana, rayala telangana, kcr, kcr supports on rayala telangana, telangana movement,

trs party will supports rayala telangana

యూ టర్న్ తీసుకున్న టీఆర్ఎస్?

Posted: 07/12/2013 07:48 AM IST
Trs party will supports rayala telangana

తెలంగాణ కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ యూ టర్న్‌ తీసుకుంటోందా అందుకే రాయల్‌ తెలంగాణపై జోరుగా చర్చ, అభిప్రాయసేకరణ జరుగుతున్నా గులాబీదళం మౌనంగా ఉందా రాయల్‌ టీకి అంగీకారమేనని కేసీఆర్‌ ఇప్పటికే సానుకూల సంకేతాలు పంపించారా రాయల్‌ తెలంగాణ ప్రతిపాదనపై కేసీఆర్‌ మౌనంతో ఇలాంటి అనుమానాలు బలపడుతున్నాయి. తెలంగాణ ఇవ్వకుండా, రాయల్‌ తెలంగాణ ఇచ్చేందుకు నాయకత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దానిని టీఆర్‌శిస్‌ తీవ్రస్థాయిలో ప్రతిఘటించకపోవడం విస్మయం కలిగిస్తోంది. తెలంగాణ తప్ప మరే ప్రత్యామ్నాయాన్ని తాము అంగీకరించేది లేదని చెబుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రస్తుతం కాంగ్రెస్‌ నాయకత్వం కోర్‌ కమిటీపై అభిప్రాయసేకరణ చేస్తున్నప్పటికీ దానిని కనీస స్థాయిలో ప్రతిఘటించకకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, దీని వెనుక పెద్ద తతంగమే నడిచిందని తెలుస్తోంది. అనంతపురం, కర్నూలు కలిపి రాయలతెలంగాణ ఇచ్చినట్టయితే శ్రీశైలం నీరు వినియోగించుకోవచ్చని టీ ఇంజనీర్లు కేసీఆర్‌కు సూచించారు. అందుకే రాయల్‌టీ ప్రతిపాదనపై కేసీఆర్‌ మౌనంగా ఉంటున్నారని స్పష్టమవుతోంది. ఆ మేరకు కాంగ్రెస్‌ నాయకత్వానికి సానుకూల సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ ఉద్యమ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles