Leaders demands cm n kiran resignation

CM N Kiran resignation,kiran,resign,warning,praveenkumar reddy, kiran,telananga

Leaders Demands CM N Kiran resignation.

రాజీనామాకు కిరణ్ సిద్దమేనా ? కావాల్సిందే ?

Posted: 07/12/2013 10:25 AM IST
Leaders demands cm n kiran resignation

రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా ? అంటే చేయాల్సిందే అని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నేడు కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోర్ కమిటీ భేటీ తర్వాత తెలంగాణ పై ఏదో ఒక నిర్ణయం చెప్పేస్తామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తేల్చి చెప్పాడు. అధిష్టానం కూడా దీన్ని నాన్చకుండా అటో ఇటో తేల్చాలని డిసైడ్ అయింది. ఈ నేపధ్యంలో ఒకవేళ అధిష్టానం రాష్ట్ర విభజన జరపాలని డిసైడ్ చేస్తే సీమాంద్ర ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరికలు పంపారు. వీరితో పాటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది పనిగట్టుకొని కిరణ్ పై ప్రచారం చేస్తున్నారో లేక మాతో పాటు ఆయన కూడా చేస్తారని అనుకుంటున్నారో , లేక కాంగ్రెస్ అధిష్టానానికి హెచ్చరిక జారీ చేస్తున్నారో కానీ రాజీనామా పై వార్తలు మాత్రం వస్తున్నాయి. ఈ వార్తల పై కొంత స్పందించి రాష్ట్ర సమైక్యతను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడమే కాకుండా, ప్రజల సెంటిమెంట్లకు వ్యతిరేకంగా రాయలసీమను చీల్చే ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు.ఈ పరిస్థితిలో రాష్ట్ర సమైక్యత కోసం కిరణ్ రాజీనామా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. కానీ తెలంగాణ పై తీర్మాణం పెట్టబోరనే కథనాలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్రపతి పాలన విధించి అయినా తెలంగాణ ఏర్పాటుకు సిద్ధం అవుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles