Caste based rallys prohibited in up

caste based rallies, caste rallies prohibited, caste rallies in up, allahabad high court, central govt, state govt, congress party, bjp, sp, bsp, election commission

caste based rallies prohibited in up

కులాల పేర్లతో సభలు ఊరేగింపులకు చెల్లు

Posted: 07/11/2013 04:21 PM IST
Caste based rallys prohibited in up

ఉత్తర్ ప్రదేశ్ లో కుల ప్రాతిపదికన జరిగే నిరసన ఊరేగింపులు నిషేధించింది అలహాబాద్ హైకోర్ట్.  ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కార్యాలయానికి నోటీసుల ద్వారా తెలియజేయటం జరిగింది.  అలాగే రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా, బసపా, సపాలకు కూడా కోర్టు నోటీసులు పంపించింది. 

ఈ మధ్యకాలంలో ఉత్తర ప్రదేశ్ లో బ్రహ్మణ్ భాయిచారా పేరుతో 40 జిల్లాల్లో ఊరేగింపులు జరిగాయి.  అందులో ఒక సభలో మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా పాల్గొన్నారు.  సమాజ్ వాది పార్టీ అందుకు దీటుగా ముస్లిం సమ్మేళన్ అంటూ సభలు నిర్వహించింది.  ఈ నేపథ్యంలో జస్టిస్ ఉమానాథ్ సింగ్, జస్టిస్ మహేంద్ర దయాళ్ ల హైకోర్టు బెంచ్ తక్షణమే అమలుపరచమని చెప్తూ, కులాల ప్రాతిపదికన జరిగే సభలు ఊరేగింపులను నిషేధించింది. 

స్థానిక న్యాయవాది మోతిలాల్ యాదవ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న హైకోర్టు నిషేధంతో రాజకీయ పార్టీల రాజకీయ ఎత్తుగడలకు కళ్ళెం పడింది.   రాజకీయ పార్టీలు చేస్తున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల సభల వలన సమాజంలో సమతౌల్యం దెబ్బతింటున్నదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిల్ వేసిన యాదవ్ అభియోగం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles