Hrithik roshan discharged from hospital

hrithik roshan discharged, hrithik brain surgery, bang bang movie, hrithik wounded in shooting, hrithik in hinduja hospital, rakesh roshan

hrithik roshan discharged from hospital

హృతిక్ రోషణ్ సేఫ్

Posted: 07/11/2013 03:40 PM IST
Hrithik roshan discharged from hospital

మెదడులో రక్తం గడ్డకట్టినందువలన శస్త్ర చికిత్స చేయించుకున్న హృతిక్ రోషణ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

హిందీ సినీ హీరో హృతిక్ రోషణ్ ని ఒక నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని, మందులు వాడాలని డాక్టర్లు సూచించారు.  ఆదివారం హిందుజ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న హృతిక్ రోషణ్ ఫొటోగ్రాఫర్లకి పోజు ఇస్తూ, నేను బాగానే ఉన్నాను అని నవ్వుతూ అన్నారు.  బ్యాంగ్కాక్ లో బాంగ్ బాంగ్ సినిమా షూటింగ్ లో తలకి దెబ్బ తగలటంతో హృతిక్ హాస్పిటల్ లో చేరారు. 

39 సంవత్సరాల హృతిక్ రోషణ్ హాస్పిటల్ లో ఉన్నప్పుడు హిందీ సెలబ్రిటీలు చాలామంది పలకరించి వెళ్ళారు.  అందులో షారుఖ్ ఖాన్, కునాల్ కపూర్, కరణ్ జోహార్ తదితరులున్నారు.  హృతిక్ డిశ్చార్జ్ అయిన సందర్భంలో ఆయన తండ్రి రాకేష్ రోషణ్ వెంట ఉన్నారు.  పూర్వకాలంలో హీరో గా నటించిన రాకేష్ రోషణ్ కుమారుడు హృతిక్ ని హీరో గా సినిమాల్లో ప్రవేశపెడుతూ సినిమా నిర్మాత అయ్యారు. 

సర్జరీ విజయవంతమవటంతో హృతిక్ సన్నిహితులంతా ఆనందంతో ఊపిరిపీల్చుకున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles