Trs telangana rabandula party

TRS, Telangana Rabandula Party, TDP, Telangana drohula party, MLA seetakka

TRS... Telangana Rabandula Party

తెలంగాణ రాబందుల పార్టీ

Posted: 06/05/2013 10:13 AM IST
Trs telangana rabandula party

రాజకీయ పార్టీలు, నాయకులు, ఒకరినొకరు విమర్శించుకోవడం రోజు రోజుకు మితిమీరి పోతుంది. అది పార్టీ పరంగా అయినా, వ్యక్తిగతంగా అయినా. తెలంగాణ అంశం పేరిట తెలుగు దేశం పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి మధ్య మాట మాట పెరుగుతుంది. ఇఫ్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు  టీడీపీని తెలంగాణ ద్రోహుల పార్టీగా చెప్పుకొస్తూ తెలంగాణ అంతా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా టీడీపీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాబందుల పార్టీని అభివర్ణించారు. తెలంగాణ అంశం పేరుతో పలువురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారని  టిడిపి ఎమ్మెల్యేలు సీతక్క, సత్యవతి రాధోడ్ లు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. టిఆర్ఎస్ అని వారు వ్యాఖ్యానించారు.అవకాశవాదులే టిఆర్ఎస్ లో చేరుతున్నారని వారు మండిపడ్డారు.సీమాంధ్ర పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయానని కడియం శ్రీహరి అంటున్నారని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కడియంకు 2013లోనే కనువిప్పు ఎందుకు కలిగిందని, ఆయనకు నిజంగా తెలంగాణ పై ప్రేమ ఉంటే అమరులైన కుటుంబాలలో ఒకరికి తన టిక్కెట్ ఇవ్వగలరా అని వారు సూటిగా ప్రశ్నించారు. మొత్తానికి టీఆర్ఎస్ టీడీపీల మధ్య మాటల యుద్దం ముదిరిందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles