Political cm kiran kumar reddy vs dl ravindra reddy

cm kiran kumar reddy, congress party, health minister dl ravindra reddy, sonia gandhi, cudapa ex mlas, mps,

cm kiran kumar reddy vs dl ravindra reddy

అండగా కడప ఎమ్మెల్యేలు

Posted: 06/04/2013 04:04 PM IST
Political cm kiran kumar reddy vs dl ravindra reddy

అమ్మ ముఖ్యమంత్రిని మార్చాండి అంటూ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన ఢిఎల్ కు .. నిరాశ మిగిలింది. చివరకు ముఖ్యమంత్రి ని .. ఢిఎల్ నే పదవి నుంచి తప్పించారు. డాక్టర్ డి.ఎల్ రవీంద్రారెడ్డి కి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పవర్ ఏమిటో చూపించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అండగా కడప ఎమ్మెల్యేలు నిలబడ్డారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డికి కడప జిల్లాలో కూడా మద్దతు లభించడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యను సమర్ధిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రకటన చేశారు.

అసలు డి.ఎల్.రవీంద్ర రెడ్డికి కిరణ్ మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సింది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలు వ్యాఖ్యానించారు. పైగా కిరణ్? పదవికి ఎసరు పెట్టడానికి డి.ఎల్.ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పటిష్టానికి యత్నించకపోగా,ప్రభుత్వ పధకాలను విమర్శించారని, అందువల్లనే పదవి నుంచి తొలగించారని వారు వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో అహ్మదుల్లా మంత్రిగా ఉన్నారు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు నలుగురు ఎమ్మెల్యేలు, టిడిపికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నా వీరితో కలవడం లేదు.మైదుకూరుకు డి.ఎల్.రవీంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కిరణ్ కు అండగా నిలబడ్డారు.డి.ఎల్.కు స్థానికంగా ఖాజీపేటలో మద్దతు లభించింది తప్ప, ఎమ్మెల్యేల పరంగా మద్దతు దొరకలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles