Minister tg venkatesh comment on kcr

tg venkatesh, minister tg venkatesh, kcr, trs party, congress party, mla gade venkata reddy, guntur meeting, telangana issue, andrhapradesh people,

minister tg venkatesh comment on kcr

ప్రజలు విడిపోరు

Posted: 05/25/2013 01:34 PM IST
Minister tg venkatesh comment on kcr

తమ రాజకీయ దాహం తీర్చుకోవటానికే ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలంగాణంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారని, ఐతే తెలుగువారంతా ఎప్పటికీ విడిపోరనీ, కోస్తా, రాయలసీమకన్నా తెలంగాణం లోనే అభివృద్ధి జరిగిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టి.జి. వెంకటేష్‌ చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తెలంగాణవాదుల తీరును ఖండించారు. మొదట ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉన్న కర్నూలును మార్చి తెలుగువారంతా కలిసే విధంగా అప్పట్లో హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

ఆ సమయంలో రాళ్లు, రప్పలతో నిండిన హైదరాబాద్‌ను తెలుగువారంతా కలసికట్టుగా అభివృద్ధి చేసి దేశానికి దిక్సూచిగా మారిస్తే నేడు తెలంగాణా వాదం పేరుతో కొందరు స్వార్థపరులు హైదరాబాద్‌ను తమ సొత్తుగా మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సమైక్యవాదిగా గతంలోనూ, నేడు, భవిష్యత్తులో కూడా ఇదే వాదనను వినిపిస్తానని ఆయన తెలిపారు. తెలుగువారంతా ఒకే జాతి అని ఆయన అభివర్ణించారు. సమైక్యాంధ్ర ప్రతినిధిగా ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అఖిలపక్ష సమావేశంలో తన వాణిని బలంగా వినిపించి తెలుగువారి ఐక్యతకు పాటుపడ్డారాని మంత్రి వెంకటేశ్‌ ఎమ్మెల్యే గాదెను కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles