Telangana news trs mp kcr comment on ys sharmila

kcr, trs mp kcr, trs party, ys sharmila, ysrcp, telangana issue, sharmila to urmila, kcr comment on sharmila, ysrcp leaders fire on kcr

trs mp kcr comment on ys sharmila

షర్మిలను ..ఉర్మిళ అంటున్న కేసిఆర్?

Posted: 05/25/2013 01:38 PM IST
Telangana news trs mp kcr comment on ys sharmila

తెలంగాణ లో జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి శిక్షణ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక పక్క తెలుగుదేశం పార్టీ మినీ మహనాడు పేరుతో సభలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సైలెంట్ గా , అమ్మపథకం, అయ్య పథకం, బంగారు తల్లి అంటూ పథకాలు ప్రవేశపెడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తుంది. వైఎస్ విజయమ్మ పార్టీ లో ఉన్న నాయకులు మధ్య నడుస్తున్న వివాదాలను పరిష్కారించే పనిలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కమలనాధులు మాత్రం ఎలాంటి హంగులు , ఆర్బాటాలు, లేకుండా ఏసీ రూమ్ ల్లో హాయిగా, చెవ్వుల్లో కమలం పెట్టుకొని నిద్రపోతున్నారు. రాష్ట్రంలో ఎండ దెబ్బకు .. జనం గుండెలు రాలిపోతున్నాయి.. రాష్ట్రంలోని రాజకీయ నాయకుల మాటలకు రాష్ట్రానికే రాజకీయ వడదెబ్బ తగులుతుంది.

కరీంనగర్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ శిక్షణ శిబిరాలకు హాజరైన కేసిఆర్, రాజకీయ పార్టీల మీద వడదెబ్బ కొట్టాడు. చంద్రబాబు మీద పగతో.. వైఎస్ షర్మిలకు కూడా కొన్ని చురకలు అంటిచారు. తెలంగాణ లో ఆంద్రరాజకీయ పార్టీలు గెలిస్తే ఆంద్రవాళ్లే సిఎం అవుతారని, తెలంగాణ వారు కాదని కేసిఆర్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే షర్మిల కాకుంటే ఉర్మిళ సీఎం అవుతుందా? అని తెలంగాణ వాడు సీఎం కాడని కేసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో సీమాంధ్ర పెత్తనంపై గ్రామాల్లో, బస్తీల్లో, లగ్గాల్లో, ధావతుల్లో, చివరకు బస్సుల్లో చర్చించి ప్రజలకు వివరించాలన్నారు. కేసిఆర్ వైఎస్ షర్మిల ను ఉర్మిళ అనటం పై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles