Political minister tg venkatesh bumper offer to kcr

minister tg venkatesh, tg venkatesh, congress party, k chandrasekara rao, kcr, trs party, cm post, tg venkates bumper offer to kcr, tdp, ysrcp, bjp, gaddar, cm post offer, telangana issue, samakyavadi, state issue, 2014 election

minister tg venkatesh bumper offer to kcr

కలిసి వస్తే కేసీఆర్‌ను సీఎం చేస్తాం

Posted: 05/17/2013 10:16 AM IST
Political minister tg venkatesh bumper offer to kcr

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. నిన్న కేసిఆర్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని చెప్పి మంత్రి మరో అడుగు ముందుకేసి, గొప్ప ఆఫర్ ఇచ్చాడు. అయితే కేసిఆర్ కలిసి వస్తే ఈ అవకావం వినియోగించుకోవచ్చునని ఆయన అన్నారు. సమైక్యవాదిగా కలసి వస్తే రాష్ట్రానికి కేసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్‌ పేర్కొన్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణాకు సీఎం కావాలన్న కేసిఆర్‌ ఆశలు కలలుగానే మిగిలిపోతాయేగానీ నెరవేరవన్నారు.

తమతో కలిసి వస్తే సీఎం అయ్యే అవకాశం ఇస్తామని, తెలంగాణా ఉద్యమాన్ని పక్కనపెట్టి రాష్ట్రా భివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. కేసిఆర్‌ కు ఎవరితో కలవలేని మానసిక రుగ్మత పట్టుకుందని, అందువల్లే జాతీయ స్థాయి పార్టీలతో కాని, ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సైతం కలవలేక పోతున్నారని అన్నారు. కనీసం ఉద్యమాలు నడిపించే గద్దర్‌, కోదండరాం, మందకృష్ణ మాదిగ కూడా ఎందుకు కలవలేక పోతున్నారని ఆయన ప్రశ్నించారు.

తెలుగుదేశం హయాంలో మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని ప్రారంభించారని, ఉద్యమం చేపట్టి 12 ఏళ్లయినా ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు టిఆర్‌ఎస్‌లో కలిసే అవకాశం లేదని, కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న స్వేచ్చ ఏ పార్టీలోనూ ఉండదని అన్నారు. ఇప్పటికైనా వేర్పాటు వాదాన్ని పక్కన పెట్టాలని లేకుంటే అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతారని మంత్రి టిజి వెంకటేష్‌ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles