Political uma bharti takes on narendra modi

uma bharti, bjp senior leader uma bharti, gujarat chief minister narendra modi, pm post, people look at modi, bpj party,

uma bharti takes on narendra modi

మోడీ పై నీల్లు చల్లిన ఉమాభారతి..?

Posted: 05/17/2013 12:39 PM IST
Political uma bharti takes on narendra modi

ప్రధానమంత్రి కావడానికి ప్రజాదరణ ఒక్కటే సరిపోదని బిజెపి ఉపాధ్యక్షురాలు ఉమాభారతి తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీంతో బిజెపికి ఆశాకిరణంగా భావిస్తున్న నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలనే పార్టీ ప్రయత్నాలకు ఉమాభారతి నీల్లు చల్లినట్లయింది. తాను ప్రజాదరణ కల్గిన నాయకురాలినే, అయినంత మాత్రనా ప్రధానమంత్రి అభ్యర్థిని అవుతానా? అని ఆమె ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నంత మాత్రనా అది ప్రామాణికమేమీ కాదని, బీజేపీలో చాలామంది నేతలకు ప్రజాభిమానం ఉందని, వారిలో మోడీ ఒకరని అన్నారు. అద్వానీ, సుష్మా స్వరాజ్‌లు ప్రజాదరణ ఉన్నవారేనని, తాను కూడా ఈ కోవకు చెందిన నాయకురాలినేనని ఆమె అన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీకి ఓకేనా? లేదా? అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా ఉమాభారతి పైవిధంగా స్పందించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles