Political congress schemes are working out

government schemes, congress party schemes, bangarutalli, amma hastam, danam nagender, may day celebrations, ravindra bharati

political congress schemes are working out

కాంగ్రెస్ పథకాలు పారుతున్నాయి

Posted: 05/01/2013 02:49 PM IST
Political congress schemes are working out

కార్మిక శాఖామంత్రి దానం నాగేందర్ సమక్షంలో ఈరోజు ఖైరతాబాద్ నియోజక వర్గంలో మహిళలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

60 మహిళా గ్రూపులకు చెందిన మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బాగా ఆకర్షించాయని, అందులో బంగారు తల్లి పథకం విపరీతంగా ఆకర్షించిందని, అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నామని చెప్పారు. 

పార్టీలో చేరటానికి వచ్చిన మహిళలందరికీ దానం నాగేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.  దీనితో ప్రభుత్వ పథకాలు ప్రజలను ముఖ్యంగా మహిళలను బాగా ప్రభావితం చేసాయనే చెప్పుకోవచ్చు. 
దానం నాగేందర్ ఆ తర్వాత రవీంద్రభారతిలో మేడే వేడుకల్లో పాల్గొన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles