Osmania university under tension due rift among student unions

tension in ou. osmania university students, rift among students organisations, ou police station, inspector p ashok

osmania university under tension due rift among student unions

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలు పోరు

Posted: 04/28/2013 05:04 PM IST
Osmania university under tension due rift among student unions

కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ వాతావరణంలో వేడి చోటుచేసుకుంది. అంతుకు ముందు తెలంగాణా ఉద్యమాలకు మద్దతుగా జరిగిన ఆందోళనలకు భిన్నంగా ఈ సారి విద్యార్థుల మధ్యనే అంతర్యుద్ధం చెలరేగి, అది హింసాకాండలకు దారితీసింది.

శుక్రవారం మొదలైన ఆ ఘటనల మీద రెండు విద్యార్థి సంఘాలనుంచి ఇప్పటి వరకు ఐదు ఫిర్యాదులను నమోదు చేసుకున్నామని ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పి.అశోక్ తెలియజేసారు. నిన్న అల్లరి చేస్తున్న విద్యార్థుల మీద స్వల్ప బలప్రయోగం చేసి చెదరగొట్టవలసి వచ్చిందని, ఆ తర్వాత మళ్ళీ ఇంత వరకు ఏ ఘటనా జరగలేదు కానీ టెన్షన్ మాత్రం వాతావరణంలో చోటుచేసుకుని ఏ మాత్రం వంక దొరికినా బయటకు పెల్లుబకటానికి తయారుగా ఉందని ఆయన అన్నారు.

ఎమ్ కాం చదువుతున్న విద్యార్థి సెల్ ఫోన్ కనపడకపోవటం చిలికిచలికి గాలివానలా తయారైంది. అతను కొంతమంది విద్యార్థులను పిలిపించి పోయిన సెల్ ఫోన్ విషయంలో వివరణ కోరటంతో తెరాస విద్యార్థి సంఘం తో సంబంధమున్న ఆ విద్యార్థుల వలన ఈ విషయం బయటకు పొక్కటంతో తెరాసవిద్యార్థి సంఘం ఎబివిపి విద్యార్థుల మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వ్యూహాలు పన్నుతుండగా ఈ లోపులో ఎబివిపి విద్యార్థులు ఒంటరిగా దొరికిన తెరాస విద్యార్థి సంఘానికి చెందిన శ్యామ్ ని కొట్టారు. దీనితో రెచ్చిపోయిన టిఆర్ఎస్ వి సభ్యులు ఎబివిపి సభ్యల మీద దాడి చెయ్యటం ప్రారంభించారు.

నిన్న సాయంత్రం ఈ దాడుల మీద ఒక తీర్మానానికి రావటం కోసం సమావేశమైన ఎబివిపి మినహా ఇతర విద్యార్థి సంఘ సభ్యులు టిఆర్ఎస్ వి సభ్యుల మీద దాడులను ఖండిస్తుండగా అక్కడి నుండి నడుచుకుంటూ పోతున్న ఎబివిపి సంఘ నాయకులు కడియం రాజు, రామకృష్ణలను చూసి వారిమీద దాడి చేసి వారిని తరుముతూ వెళ్ళారు.

ఆందోళన చేస్తున్న ఒక విద్యార్థి సంఘం సభ్యులు రైట్ వింగ్ నాయకుల దిష్టి బొమ్మలను తగులబెట్టగా మరో సంఘానికి చెందిన విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ మీద ఉన్న సరస్వతీ విగ్రహాన్ని తాడుకట్టి లాగి ఆర్ట్స్ కాలేజ్ పోర్టికో మీద నుంచి కింద పడేసి పగులగొట్టారు.

పోలీసులు రంగ ప్రవేశం చేసి కొద్దిపాటి బలప్రయోగం చేసి అల్లరి మూకలను చెదరగొట్టారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles