Shadow hero venkatesh photo appears on yscp flexies

venkatesh on yscp flexies, shadow movie, hero venkatesh, nt rama rao, jr ntr, mahesh babu, jagan, sharmila padayatra

shadow hero venkatesh photo appears on yscp flexies

హీరో వెంకటేష్ ని చేర్చుకున్న వైకాపా

Posted: 04/28/2013 04:04 PM IST
Shadow hero venkatesh photo appears on yscp flexies

మచిలీపట్నంలో షాడో సినిమా హీరో వెంకటేష్ జగన్ తోపాటు వైకాపా ఫ్లెక్సీ మీద కనపడటం మరోసారి దుమారం లేపింది.

లోగడ జూనియర్ ఎన్టీఅర్ చిత్రం బాద్షా విడుదలైన సందర్బంగా కృష్ణా జిల్లాలో వైకాపా బ్యానర్లు కట్టటం తెలుగు దేశం పార్టీలో కలకలం సృష్టించింది.  ఎన్నో అనుమానాలను సృష్టించి పార్టీలో అంతర్గతంగా చిచ్చును రేపింది.  అంతకు ముందు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫొటోను కూడా వైకాపా ఫ్లెక్సీల మీద ముద్రించటం విమర్శలకు దారితీసింది.  అయితే ఆయన పార్టీ పెట్టకముందు నుంచే తెలుగు వారి అభిమానాన్ని చూరగొన్నారని, ఆయన ఫొటో పెట్టుకోవటంలో తప్పు లేదన్న జూనియర్ ఎన్టీఆర్ తన ఫొటోని కూడా పెట్టేటప్పటికి, నందమూరి బాలకృష్ణ దాని మీద జూనియర్ ఎన్టీఆర్ వివరణను కోరటం, ఆయన నాకు తెలియదు, నేను చేసింది కాదు, నేను తెలుగు దేశం పార్టీకీ అంకితమైనవాడిని, అది మా తాతగారు స్థాపించిన పార్టీ కాబట్టి దానిని వీడిపోయే ప్రసక్తే లేదంటూ ప్రకటించటం జరిగింది. 

ఖమ్మంలో షర్మిల పాదయాత్ర సాగిస్తున్న సమయంలో అక్కడ వైయస్ కాంగ్రెస్ పార్టీ బ్యానర్ల మీద మహేష్ బాబు ఫొటో కలకలం రేపింది.  ఇంకేమిటి మహేష్ బాబు ఆ పార్టీలో చేరిపోతున్నారనే వదంతి పుట్టింది. 

తాజాగా షాడో సినిమా విడుదలవటంతో మచిలీ పట్నంలో వైకాపా మరోసారి వెంకటేష్ తో కలిసి పార్టీ నాయకులతో ఫ్లెక్సీని తయారు చేసి కట్టింది.  దానితో మరోసారి అనుమానాలకు తెరతీసింది.  హీరో వెంకటేష్ అసలే షాడో ఫెయిల్ తో దిగాలుగా ఉంటే ఈ ఫ్లెక్సీ గోల ఇంకా తలనొప్పి కలిగిస్తోంది. 

అయితే ఈ హీరోల ఫొటోలను ఇక ముందు కూడా ఇలాగే వాడుకుంటే ఈ పద్ధతి పాతపడిపోతుంది కాబట్టి అప్పడు ఇక ఎవరూ పట్టించుకోరు కానీ ప్రస్తుతం ఇదో చర్చనీయాంశమైంది. వైకాపా ఏం సాధించటానికి మరో పార్టీలవాళ్ళని లేదా ఏ పార్టీలో లేనివాళ్ళ ఫొటోలు పెట్టుకుంటుందో కానీ పార్టీల్లోనూ ప్రజల్లోనూ విపరీతమైన సందిగ్ధావస్తలు, పలు అనుమానాలకు దారితీస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles