Ammonium tanker failure in eluru

ammonium tanker failure in eluru, ammonium gas leak from tank in eluru, ammonia leakage,

ammonium tanker failure in eluru

అమ్మోనియం ట్యాంకర్ బోల్తా? ప్రజల్లో టెన్షన్

Posted: 04/22/2013 11:00 AM IST
Ammonium tanker failure in eluru

జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన గ్యాస్‌ ట్యాంకర్‌ ఏలూరు వాసులకు కంటిపై కనుకు లేకుండా చేస్తోంది. ట్యాంకర్‌ నుంచి వెలువడిన అమ్మోనియం గ్యాస్‌ జనాన్ని భయాందోళనకు గురి చేసింది. రెండు కిలో మీటర్లకు పైగా గ్యాస్‌ వ్యాపించడంతో పలువురు వాంతులు, కళ్ల మంటలతో ఇబ్బంది పడ్డారు. నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గత రాత్రి ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆసుపత్రి దగ్గర అమ్మోనియం గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ట్యాంకర్‌ నుంచి అమ్మోనియం గ్యాస్‌ లీకవడంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. ఘటనాస్థలికి అత్యంత సమీపంలో ఆసుపత్రి ఉండటంతో అధికారులు హుటాహుటిన తరలి వెళ్లారు. జాతీయ విపత్తు నివారణ కమిటీ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles