Chandrababu naidu ending padayatra at vizag

chandra babu ending padayatra, telugu desam party, padayatra ending at vizag, rally on padayatra ending, vasupalli ganesh kumar

chandrababu naidu ending padayatra at vizag

చంద్రబాబు పాదయాత్ర ముగింపు

Posted: 04/17/2013 04:02 PM IST
Chandrababu naidu ending padayatra at vizag

విశాఖ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పాదయాత్రను ముగిస్తారు.  అందుకు పార్టీ పెద్దలు సర్వసన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా పచ్చజెండాలతో విశాఖపట్నాన్ని సుందరంగా అలంకరించటం, భారీ ర్యాలీ నిర్వహించటం చేస్తామని చెప్తూ, చంద్రబాబు పాదయాత్రను విశాఖపట్నంలో ముగించటం తమ అదృష్టమని, ఎంతో ఉత్సాహంగా ఉన్న కార్యకర్తలందరితో కలిసి పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఘనంగానూ, విజయవంతంగానూ చేస్తామని తెలుగుదేశం విశాఖపట్న నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 

చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించబోయే ర్యాలీలో 10 వేల ద్విచక్ర వాహనాలు పాల్గొంటాయని కూడా గణేష్ కుమార్ తెలియజేసారు.  విశాఖపట్నంలోని 72 వార్డ్ లలోనూ పార్టీ జెండాలతో అలంకరించటం జరుగుతుందని కూడా ఆయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles