Ravuri bhardwaja gets jnanapeeth award

jnanpeeth to ravuri bhardwaja, telugu writer ravuri bharadwaja, loknayak foundation award, tripuraneni gopichand sahitya award

ravuri-bhardwaja-gets jnanapeeth award

ravuri-bhardwaja.png

Posted: 04/17/2013 03:24 PM IST
Ravuri bhardwaja gets jnanapeeth award

2009లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం, 2011 లో త్రిపురనేని గోపీచంద్ సాహిత్య పురస్కారం అందుకున్న రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠం పురస్కారం లభించింది. 

రావూరి భరద్వాజ రచించిన పాకుడు రాళ్ళు పుస్తకంతో ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.  ఆ పుస్తకంలో ఆయన సినిమా రంగంలోని వ్యక్తుల అంతరంగంలోని విచారధారను అత్యంత రమ్యంగా కళ్ళకు కట్టేట్టుగా రాసారు. 

జ్ఞానపీఠం పురస్కారం అందుకున్న తెలుగువారిలో రావూరి భరద్వాజ మూడవవారు.  విశ్వనాధ సత్యనారాయణ, డా.సి.నారాయణ రెడ్డి అంతకు ముందు జ్ఞానపీఠాన్ని అందుకున్నారు. 

రావూరి భరద్వాజను ఈ సందర్భంలో పలువురు అభినందించారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles