Bjp pm candidate png

ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు

Posted: 04/17/2013 03:11 PM IST
Bjp pm candidate png

ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ నాయకుడు వెంకయ్యనాయుడు, ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవికి పోటీచెయ్యటానికి అభ్యర్థిని ఎవరినీ ఇంకా నిర్ణయించలేదని అన్నారు. 

ప్రధానమంత్రి పదవికి ఎవరు పోటీ చెయ్యాలన్న విషయాన్ని మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతనే నిర్ణయిస్తామన్నారు.  ఇంతవరకు ఎవరన్నది చర్చలోకి రాలేదని చెప్పారాయన.  అయితే అది ఎవరైనా ఎన్డియే తో భాగస్వామ్యంలో ఉండే పార్టీలతో చర్చించిన తర్వాతనే నిర్ణయించబడుతుందన్నారు వెంకయ్య నాయుడు. 

అభ్యర్థి ఎవరన్నది తెలియకపోయినా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మాత్రం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని వెంకయ్య నాయుడు కొనియాడారు. 

ఈ మధ్య ఇతర పార్టీ నాయకులలో ములాయమ్ సింగ్ యాదవ్ కానీ నితిష్ కుమార్ కానీ నరేంద్రమోదీ మీద చేసిన వ్యాఖ్యల వలన ఇప్పటినుంచే వ్యతిరేకత ఎందుకులే అని భాజపా నేతలు అనుకున్నట్టున్నారు.  అనవసరంగా అభ్యర్థి పేరుని బయటపెట్టి ఇప్పటినుంచే అతని మీద అందరి కళ్ళూ పడేట్టుగా చేసి, వ్యాఖ్యలతో దాడి చేయించి, తీరా అవసరం పడేటప్పటికి ఆ అభ్యర్థి ప్రజాదరణను పోగొట్టుకుంటే అంతా వృధా అవుతుందని అనుకున్నారేమో బాహాటంగా అందరికీ తెలిసిన విషయాన్ని గుప్తంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.  పైగా ఎవరెవరితో మైత్రికి పోవలసివస్తుందో ఇంకా తెలియదు కాబట్టి జాగ్రత్త వహిద్దామని అనుకుంటున్నట్టుగా కూడా అర్థమవుతోంది. 

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles