Cpi leaders arrest in land grabbing case protested

cpi, cpi dist secy, cpi town secy, land grabbing case govt land, kadapa collectorate, tahsildar

cpi leaders arrest in land grabbing case protested

ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సిపిఐ నాయకుల అరెస్ట్

Posted: 04/16/2013 01:20 PM IST
Cpi leaders arrest in land grabbing case protested

ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ చేసిన సిపిఐ నాయకులను వెంటనే విడుదల చెయ్యవలసిందిగా కోరుతూ యర్రముక్కపల్లి నుంచి కడప కలెక్టరేట్ వరకు సిపిఐ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.  దారిలో అరెస్ట్ లను చేసిన తహసిల్దార్ కె.శ్రీనివాసులు దిష్టి బొమ్మను తగులబెట్టారు.  భూమిని ఆక్రమించి ఇతరులకు అమ్మి లాభాలు పొందే కాంగ్రెస్ నాయకులను ఏమీ చెయ్యరు కానీ, పేదలకు స్థలాలను పంచితే అది భూ ఆక్రమణ కిందికి వస్తుందా అంటూ సిపిఐ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. 

43000 పేదలకు భూమిని పంచటానికి పుట్లంపల్లి చెరువు భూమిని సిపిఐ నాయకులు ఆక్రమించగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నేరానికి జిల్లా సెక్రటరీ జి.ఈశ్వరయ్య, పట్టణ సెక్రటరీ జి.చంద్ర, ఇంకా సిపిఐ నాయకులు టి.బాలసుబ్రహ్మణ్యం, ఎన్.వెంకట శివ, జి.మద్దిలేటి, కె.సి.బాదుల్లా, బోగడి శెట్టి, జి.వేణుగోపాల్ లను అరెస్ట్ చేసారు.  వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వాళ్ళకి జ్యుడిషియలం కస్టడీ విధించడమైనది. 

ఈ అరెస్ట్ లను వామపక్ష నేతలందరూ ఖండించారు.  ఆక్రమించిన ప్రభుత్వ భూమిని భూమి లేని పేదలకు పంచటం జరుగుతుంటే భూ ఆక్రమణ అంటూ కేసు పెడతారా అంటు సిపిఐ నాయకులు ప్రశ్నిస్తూ అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. 

ఈ ఆందోళనలో ఏఐటుయుసి సెక్రటరీ మల్లికార్జున రెడ్డి, ఏఐఎస్ఎఫ్ సిటి సెక్రటరీ జి.సురేష్ మరెందరో నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles