Fire broke in tirumala annadana building

tiruapati, tiruamala annadanam, fire at tirumal, annadanam cancelled, ttd chairman bapiraju

fire broke in tirumala annadana building

తిరుమల అన్నదాన భవనంలో అగ్ని ప్రమాదం

Posted: 04/16/2013 09:56 AM IST
Fire broke in tirumala annadana building

ఈరోజు ఉదయం తిరుమల నిత్యాన్నదానం జరిగే క్యాంటీన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  ఒక్కసారిగా ఎగిసిన మంటలకు భయపడ్డ సిబ్బంది బయటకు పరుగులు తీసారు.  అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పటానికి కృషి చేస్తున్నారు. 

అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయ్యుండవచ్చని అధికారులు భావిస్తున్నారు.  తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఇవో శ్రీనివాసరాజు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

వంట సామగ్రి, కొన్ని వంట పదార్థాలు కూడా అగ్నికి అహుతి అయ్యి, మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవటంతో ఈ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నారు. 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles