Tdp mla kamalakar to join in trs party

tdp mla kamalakar latest news, tdp mla kamalakar to join in trs party, telangana issue in ap, kcr telangana statehood, tdp, chandrababu naidu, yerrabelli dayakara rao,

tdp mla kamalakar to join in trs party

సీనియర్ నాయకులు బుజ్జగింపు యత్నాలు

Posted: 04/15/2013 07:44 PM IST
Tdp mla kamalakar to join in trs party

భయం .. భయం టిడిపి పార్టీకి పెను భయం పట్టుకుంది.  నిన్నటి వరకు  ఫోస్టర్ వివాదంలో చిక్కుకొని బయటపడిన పార్టీకి మరో చావు దెబ్బతగలనుంది? బాబు బాధపడుతూ పాదయాత్ర చేస్తుంటే.. పార్టీ నుండి భయంలేకుండా నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. అసలే కాలినొప్పితో బాధపడుతున్న బాబుకు జరుగుతున్న పరిణామం ముల్లుతో గుచ్చినట్లుగా ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎమ్మెల్యే  గంగుల కమలాకర్  సైకిల్ దిగి.. కారు ఎక్కటానికి సిద్దంగా  బస్టాప్ లో ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల్లో గులాబి కారు వచ్చి గంగులా కమలాకర్ ను ఎక్కించుకోవటాని రెడీ అవుతుంది.  ఈ విషయం తెలుసుకున్న  టిడిపి సీనియర్ నాయకులు  గంగుల కమలాకర్ కు గులాబి కారు కింద ఉన్న బాంబులు గురించి చెబుతున్నారు.  ఆయన మాత్రం గులాబి కారు ఎక్కి  గులాబి కండువ వేసుకోవటానికే సిద్దపడినట్లు తెలుస్తోంది. ఇక ఆయన గులాబి కండువ వేయించుకోవడమే తరువాయి. త్వరలోనే కరీంనగర్‌లో జరగబోయే బహిరంగ సభలో గంగుల టి.ఆర్.ఎస్.లో చేరే అవకాశం ఉందని స్పష్టమైపోయింది.  గంగుల కమలాకర్‌ను ఎలాగైనా పార్టీలోనుంచి వెళ్లిపోకుండా ఆపాలని తెలుగుదశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబిల్లి దయాకర్ ప్రభృతులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇప్పటికే టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో అన్ని విషయాలూ కూలంకషంగా మాట్లాడుకున్న గంగుల తెలుగుదేశం పార్టీనుంచి నిష్క్రమించడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఆయన తమ సహచరులతో కూడా ఈ విషయం చర్చించారు.  అయితే గంగులను టి.ఆర్.ఎస్.లోకి తీసుకుంటే ఆయన ఎమ్మెల్యే స్థానం ఆయనకే ఇవ్వాలి కాబట్టి తమ సంగ తి ఏమిటని నారదాసు టి.ఆర్.ఎస్. నాయకుడు కె,సి.ఆర్.ను ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. అయితే కె.సి.ఆర్. ఆయనను బుజ్జగించి, పార్టీని బలోపేతం చేయడం తెలంగాణ ఆశయ సాధనలో చాలా ముఖ్యమని నచ్చజె ప్పినట్టు తెలుస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles