Nagam janardan reddy goes to bjp camp

nagam janardan reddy, telangana nagara samiti, telangana rashtra samiti, bharatiya janata party, congress party

nagam janardan reddy goes to bjp camp

నాగం జనార్దన రెడ్డి భారతీయ జనతా పార్టీ గుడారంలో

Posted: 04/12/2013 01:56 PM IST
Nagam janardan reddy goes to bjp camp

తెలంగాణా నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన రెడ్డి భారతీయ జనతా పార్టీ గుడారంలో అడుగుపెట్టారు. 

నిన్న ఉగాది సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో హాజరైన నాగం జనార్దన రెడ్డి భాజపాకి గ్రహానుకూలం ఉన్నట్టుగా తెలుసుకున్నారు.  అయితే నిన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఉజ్వలమైన భవిష్యత్తుందని వారి వారి కార్యాలయాలలో నిర్వహించిన పంచాంగ శ్రవణాలు తెలియజేసాయనుకోండి.

తెలంగాణా రాష్ట్ర సాధనకోసమే తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన నాగం ఆ పని ఒక్క భాజపా వలనే అవుతుందన్న ప్రగాఢ విశ్వాసం కలిగిందని, కేంద్రంలో అధికారంలోకి రాగానే భాజపా తెలంగాణా సమస్యను పరిష్కరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తపరచారు.  అందువలన భాజపా ఢిల్లీ గద్దెను ఎక్కటం అవసరమని, అందుకోసం తాను భాజపాకి పూర్తి మద్దతునిస్తానని నాగం అన్నారు. 

రాజకీయాల్లో ప్రతి ఎత్తు ఆచి తూచి వెయ్యాలి కాబట్టి, బయటనుంచి మద్దతుని ప్రకటిస్తున్నారు కానీ నాగం భాజపాతో ఏకమయే ఆలోచననేమీ బయటపెట్టలేదు.  అంతే కాదు తెలంగాణా కోసమే పుట్టానని చెప్పుకునే తెలంగాణా రాష్ట్ర సమితి గురించి కూడా నాగం తాజాగా ఏమీ చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ వలన తెలంగాణా అంశంకాస్తా అటకెక్కిందని మాత్రం చెప్పారాయన.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles