Petition filed on pubs in hrc

pubs in hyderabad, banjara hills, hrc, youth making havoc outside pub, police commissioner of hyderabad, police commisstioner of cyberabad

petition filed on pubs in hrc

పబ్ ల మీద పిటిషన్

Posted: 04/12/2013 02:24 PM IST
Petition filed on pubs in hrc

యువతను పెడదారి పట్టటానికి పబ్ లు దోహదం చేస్తున్నాయంటూ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలైంది.  దాని మీద స్పందించిన హెచ్ ఆర్ సి, నగరంలోని పబ్ ల మీద నివేదికను కోరుతూ ఈ నెల 17 లోగా నివేదికను సమర్పించమని హైద్రాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు పంపించింది. 

నిన్న రాత్రి సంఘటనతో నగరంలోని పబ్ ల వలన యువత నడవడికలో ఎంత మార్పు వస్తోందో అర్థమౌతోంది.  అర్ధరాత్రి వరకు గడపటం, అర్ధనగ్నంగా సంచరించటం, మత్తు మాదక ద్రవ్యాలను ఉపయోగించటం, విచ్చలవిడిగా తిరగటం, దారిని కనిపించినవారితో దాడికి దిగటం, ఇదంతా తెలిసి వెళ్ళిన మీడియా మీద తిరగబడటం, వాళ్ళని అనరాని మాటలు అనటం నిన్న అర్థరాత్రి సంఘటన ఒక విధంగా మేలే చేసింది. 

నగరం నిద్రపోతోంది కానీ యువతలో అలజడి హద్దులు మీరేట్టుగా చేస్తోందన్న విషయం మీడియా వలన అందరికీ తెలిసింది.  యువతను పెడదారి పట్టించటానికి గుట్టుగా సాగే కార్యక్రమాలలో ఒకటైన పబ్ కల్చర్ బట్టబయలవటం వలన ప్రభుత్వం, అధికారులు, ఇంట్లో పెద్దలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలిగింది.  వీడియోలో కనిపించినంతవరకు మత్తులో ఉన్న మహిళలు చేసిన వ్యాఖ్యలు, రెండు రోజుల క్రితం మాదకద్రవ్య ప్రభావంతో జుబ్లీ హిల్స్ ప్రాంతంలో నడిరోడ్డులో వీరంగమాడిన వనిత సంఘటన మనమే దిశగా పోతున్నామని ప్రశ్నించుకునేట్టుగా చేస్తోంది. 

చెడు దారి పట్టే యువత వలన శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే పరిస్థితి ఉందని తెనాలి సంఘటన తెలియజేస్తోంది.  ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సానియా అనే యువతి శవంగా మారి గండిపేట కూడలిలో లభించటం, అది కూడా తగలబడి కనపడటం ఇలాంటి సంఘటనలను చూసైనా యువత మారకపోతే ఇక న్యాయస్థానాలు, ప్రభుత్వం, అధికారులు, పెద్దలు రంగంలోకి దిగవలసిందే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles