డబ్బింగ్ సీరియల్స్ ని నిలిపివేయాలని కోరుతూ టివి కళాకారులు ఇందిరాపార్క్ దగ్గర చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఈరోజు పదకొండోరోజుకి చేరుకుంది. ఈరోజు దీక్షలో టివి కళాకారుడు విజయయాదవ్ పాల్గొని, దాన్ని నిరవధిక దీక్షగా మార్పు చేసారు.
వీరి ఆందోళనకు మద్దతు తెల్పుతూ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు, దర్శకుడు దాసరి నారాయణరావు, సిపఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కళాకారుల పొట్టల కొడుతూ డబ్బింగ్ సీరియల్స్ ని ప్రసారం చేస్తున్న తెలుగు టివి ఛానెల్స్ యాజమాన్యం మీద ఆగ్రహాన్ని వ్యక్తంచేసారు. ఎంతో కాలంగా డబ్బింగ్ సీరియల్స్ ప్రసారాలను చేపట్టవద్దని చెప్తున్నా వినకుండా అలాగే కొనసాగిస్తూ స్థానిక కళాకారులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ టివి, జెమిని టివి యాజమాన్యాలు మాత్రమే టివి కళాకారుల వ్యధను గుర్తించి డబ్బింగ్ సీరియల్స్ ని ఇక ప్రసారం చెయ్యమని ప్రకటించటం పట్ల సినీ ప్రముఖులు, టివి కళాకారులు హర్షాన్ని వ్యక్తపరచారు. మిగిలిన ఛానెల్స్ కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోనట్లయితే ఉద్యమం ఇంకా తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు. జి తెలుగు కూడా కాస్త మెత్తబడ్డట్టుగా కనిపించినా రాతరూపంలో హామీ ఇవ్వలేదని వాళ్ళు తెలియజేసారు.
మా టివి, జి తెలుగు కార్యాలయాల ముందు ధర్నా చేసిన కళాకారులు అలా ప్రతిరోజూ చేస్తామని అన్నారు. 62 డబ్బింగ్ సీరియల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయని, వాటి వలన స్థానిక కళాకారుల ప్రతిభ మట్టిగొట్టుకుపోతోందని టివి కళాకారులు వాపోయారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more