రేపు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు మలేషియాలో నిర్వహిస్తున్న ప్రపంచ మహాసభలలో ఇది 10 వ మహాసభ. రెండు సంవత్సరాలకోసారి నిర్వహించే తెలుగు మహాసభలలో ఈసారి మలేషియా ప్రధానమంత్రి అబ్దుల్ రజాక్ ముఖ్య అతిథి. తమిళనాడు గవర్నర్ రోశయ్య, భారత రాయబారి విజయ్ గోఖలేల ప్రసంగాలుంటాయి. సినీ ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు, డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా.వి.లక్ష్మణ్ దత్ లను సన్మానిస్తారు.
స్థానిక ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో ఈ సభలకు హాజరవుతున్నారు. తరువాతి రోజు అంటే 13న నిర్వహించే వ్యాపార సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొంటారు.
14 న అంటే ఆఖరి రోజున నిర్వహించే సభలకు కేంద్రమంత్రి బలరామ్ నాయక్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథులుగా వ్యవహరిస్తారు. ఈ ముగింపు ఉత్సవంలో సినీ ప్రముఖులకు, కళాకారులకు సన్మానం చేస్తారు. అందులో కె.రాఘవేంద్రరావు, కీరవాణి, ఎమ్ఎమ్ శ్రీలేఖ, వందేమాతరం శ్రీనివాస్, సాయికుమార్, అలీ, హేమలు ఉంటారు.
ఈ సమావేశాలలోని వేడుకలలో సినీ, ఇతర కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. దానితో పాటు తెలుగు భాషా ప్రచారం, ప్రవాసాంధ్రుల స్తితిగతులలాంటి అంశాలమీద చర్చలు కూడా ఉంటాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more