Accused cuts hand before magistrate

magistrate, l k advani, bjp party, alam patti, bomb plan on advani, accused cuts his hand

accused cuts hand before magistrate

జడ్జ్ ఎదురుగా చెయి కోసుకున్న ఖైదీ

Posted: 04/11/2013 11:10 AM IST
Accused cuts hand before magistrate

2011 అక్టోబర్ 28 న భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్ కే అద్వానీ దక్షిణ భారత పర్యటనలో అద్వానీ లక్ష్యంగా ఆలం పట్టి ప్రాంతంలో బ్రిడ్జ్ దాటేటప్పడు బాంబు దాడి చేయటానికి ప్రయత్నించిన నేరం మీద అరెస్టై నిన్న మేజిస్ట్రేట్ ముందుకి వచ్చిన 27 సంవత్సరాల జాకిర్ హుస్సేన్ తను ఉగ్రవాదిని కానని చెప్తూనే మేజిస్ట్రేట్ పన్నేర్ సెల్వం చూస్తుండగానే అకస్మాత్తుగా బ్లేడ్ తో తన ఎడమ చేతికి గాయం చేసుకున్నాడు. 

జాకిర్ హుస్సేన్ ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు.  తర్వాత అతని ప్రాణానికి ప్రమాదమేమీ లేదని పోలీసులు ప్రకటించారు.  అయితే ప్రశ్న ఏమిటంటే అతని దగ్గరకు బ్లేడ్ ఎలా చేరింది అని.  తిరునగర్ లో జాకిర్ నివాసం నుంచి మార్చి 28 న అరెస్ట్ చేసి తీసుకునివచ్చి పోలీస్ కస్టడీలో పెట్టుకున్న అతను బ్లేడ్ ఎలా సంపాదించాడు అన్న విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

బాంబు దాడి ప్రయత్నంలో కేసు నమోదు చేసిన 10 మందిలో పోలీసులు 7 గురిని అదుపులోకి తీసుకున్నారు.  అందులో జాకిర్ హుస్సేన్ ఒకడు.  అద్వానీ ఆలం పట్టి బ్రిడ్జ్ చేరుకోకముందే బాంబుని అప్పుడు డిఫ్యూజ్ చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles