Ugadi being celebrated in temples and political offices

ugadi, telugu new year, ugadi celebrations, panchanga sravanam, know the star impact on ugadi, political parties

ugadi being celebrated in temples and political offices

రాష్ట్రమంతా ఉగాది వేడుకలు

Posted: 04/11/2013 10:08 AM IST
Ugadi being celebrated in temples and political offices

ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ విశేషాలంకరణలు, విశేష పూజలు, భక్తుల కోలాహలంతో నిండిపోయాయి. 

పండుగ గురువారం రావటం వలన ఆదివారం వరకు శలవులు తీసుకుని దగ్గరివారితో ఉగాదిని గడుపుకుందామని, కలిసి యాత్రలు చేద్దామని ఇలా వివిధ ప్రణాళికలు వేసుకున్నవారున్నారు.  రద్దీని ముందుగానే ఊహించిన రైలు రవాణా శాఖలు తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. 

ఉగాది వేడుకలలో ప్రధానమైన పంచాంగం శ్రవణాన్ని అన్ని ఆలయాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలూ ఏర్పాటు చేసాయి.  రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సభాపతి నాదెండ్ల మనోహర్, ఇంకా ఎందరో మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో రవీంద్రభారతిలో ఉగాది సంబరాలు జరుపనున్నారు. 

తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.  వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని లో ఈ రోజు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం చేస్తున్నారు.  గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భాజపాలు పంచాంగ శ్రవణం చేయబోతున్నాయి. రాజకీయపార్టీలు తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాయి.

ఈరోజు ఇప్పటి వరకు చూసుకుంటే శ్రీశైలంలో భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంది.  తిరుమలలో సామాన్యంగా ఉంది.  పండుగ ఇళ్ళల్లో చేసుకున్న తర్వాత తిరుమలలోనూ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోవచ్చని అంచనా వేస్తున్నారు.  విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేంచేసివున్న దుర్గమ్మ దర్శనార్ధం వెళ్ళే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. 

ఇక్కడా అక్కడా అని కాదు చిన్నా పెద్దా అన్ని దేవాలయాలు ఈ రోజు సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడుతాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles