Alcohol is injurious to others too

alcolhol is injurious, telanai, guntur district, alcoholics caused death, eve teasing

alcohol is injurious to others too

మద్యం సేవనం హానికరం

Posted: 04/09/2013 11:47 AM IST
Alcohol is injurious to others too

మద్యం సేవించటం అమాయకుల ప్రాణానికి ఎంత హానికరమన్నది తెనాలి సంఘటనలో నిరూపితమైంది.  గుంటూరు జిల్లా తెనాలి లో గాంధీ చౌక్ లో యువత పూర్తిగా మద్యం మత్తులో తూగుతున్న సమయంలో అటునుంచి వెళ్తున్న స్థానికులను తల్లీ కూతుళ్ళను అడ్డగించారు.  బిటెక్ చదువుతున్న అమ్మాయి మీద చెయ్యి వేయటమే కాకుండా అసభ్యంగా మాట్లాడుతున్న వాళ్ళని తల్లి అడ్డుకుంటుండగా వాళ్ళు ఆమెను తోసి వేసారు. 

అది ఆమెను మృత్యువు వైపు తోసివెయ్యటమైందన్న విషయం ఆ సమయంలో వాళ్ళకి తెలియదు.  ఆ రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ కింద పడిందామె.  తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిపోయిన ఆమెను మంగళగిరి హాస్పిటల్ కి తరలించారు.  ఎస్ ఆర్ ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

ఆ అఘాయిత్యానికి పాల్పడ్డ వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఒక మనిషి ఇంకా దొరకలేదని పోలీసులు తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles