Woman under debris for 36 hours

thane building collapse, western coastal area, woman in debris for 36 hours

woman under debris for 36 hours

శిథిలాల కింద 36 గంటలున్న మహిళ

Posted: 04/06/2013 06:12 PM IST
Woman under debris for 36 hours

థానే లో కుప్ప కూలిన ఏడంతస్తుల భవనంలో ఇంతవరకు మరణించినవారి సంఖ్య 72.  జీవించివున్నవారి కోసం చేసిన గాలింపులో సహాయక బృందాలు నిర్విరామంగా శిథిలాలను జాగ్రత్తగా తొలగించుకుంటూ పోవటం మంచిదైంది.  గురువారం నుంచి ఈ రోజు ఉదయం వరకు దాదాపు 36 గంటలు ఆ శిథిలాల కింద జీవంతో ఉన్న ఒక మహిళ బయటపడింది.  ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారు.  ఒక 10 నెలల పాపను కూడా కాపాడగలిగారు. 

అసలు ఏం జరిగిందో, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా 36 గంటలసేపు శిథిలాల కింద ఉన్న ఆ మహిళ ఎంతటి నరకయాతన అనుభవించివుండవచ్చన్నది తలచుకుంటేనే జాలి వేస్తోంది,  అలాగే ఆ చిన్న పాపని తలుచుకుంటే భయం కూడా కలుగుతోంది అన్నారు ఆ చుట్టుపక్కలవాళ్ళు.  ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా శిధిలాలను జాగ్రత్తగా తొలగిస్తూ భవంతి కూలిపోయిన దగ్గర్నుంచి ఇప్పటి వరకూ నిర్విరామంగా పనిచేస్తున్న సహాయక సిబ్బందిని అందరూ మెచ్చుకున్నారు. 

ఇప్పటికీ శిథిలాలను పూర్తిగా తొలగించలేదని, ఇంకా 30 శాతం మిగిలిపోయి ఉందని, ఇంకా ఎవరైనా వాటి అడుగున జీవంతో ఉన్నారేమోనన్న అనుమానంతో జాగ్రత్తగా వాటిని తొలగిస్తున్నామని సహాయక బృందం చెప్పింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles