Cm ugadi gift to sc sts

chief minister, kiran kumar reddy, sc st plan, ugadi festival

cm ugadi gift to sc sts

బడుగు వర్గాలకు ఉగాది కానుక

Posted: 04/06/2013 06:17 PM IST
Cm ugadi gift to sc sts

బీదరిపు రేఖకంటే అడుగున వున్న నిరుపేదలకోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని వెసులుబాట్లను చేసారు.  ఉప్పు పప్పు చింతపండు నూనె కారం పసుపు లాంటి నిత్యావసర వస్తువులను ప్రతినెలా 185 రూపాయలకే సరఫరా చేయిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అన్నారు.  ఎస్ సి ఎస్ టి సబ్ ప్లాన్ కింద మార్కెట్ లో 292 రూపాయలకు లభించే నిత్యావసర వస్తువులను రాయితీ తగ్గించి 185 కే లభించేట్టుగా చూస్తానని ఆయన మాటిచ్చారు. 

రోజు రోజుకీ పెరిగిపోతున్న ధరల నుంచి పేదవర్గాలను ఆదుకోవటానికి ఇది ఒక మంచి ఉపాయమని ముఖ్యమంత్రి అన్నారు.  ఈ నెల 11 ఉగాది రోజు నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది.  అదే రోజు జ్యోతిరావు ఫులే జన్మదినం అవటం విశేషమని కూడా ముఖ్యమంత్రి అన్నారు.  ఎస్ సి ఎసి టి సబ్ ప్లాన్ అమలు ద్వారా ఇందిరా గాంధీ కలలు సాకారమవుతున్నాయని కూడా ఆయన అన్నారు. 

సాధికారమైన ఈ పథకం అమలు వలన గతంలో జరిగినట్టుగా ఈ నిధులలో అవినీతి జరగటం ఉండదని కిరణ్ కుమార్ అన్నారు.  పది లక్షల మంది ఎస్ సి కుటుంబాలకు విద్యుత్ ని ఉచితంగా సరఫరా చేస్తామని కూడా ఆయన మాటిచ్చారు. 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ముఖ్యమంత్రి దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles