Rapes and molestations faced from known persons

rapes in india, medak district, women safety measures, women prone to molestation, harm from know people

rapes and molestations faced from known persons

known-persons.png

Posted: 04/04/2013 08:49 AM IST
Rapes and molestations faced from known persons

violenceమహిళల మీద కానీ మైనర్ బాలికల మీద కానీ అత్యాచారాలు జరిగిన సంఘటనలను చూసుకుంటే, ఎక్కువగా వాళ్ళకి తెలిసినవాళ్ళతోనే వాళ్ళకి ముప్పు జరిగింది. స్త్రీ కాని బాలిక కానీ ఒంటిరిగా ఉన్న సమయంలో బెదిరించయినా అఘాయిత్యానికి పూనుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవి మొదటివాటి కంటే తక్కువే. ఇంకా తక్కువగా ఉన్న సంఘటనలు సామూహికంగా దాడికి దిగినవి.

ఇవన్నీ చూసి ఇంకా పాఠాలు నేర్చుకోకుండా ఉండటమనేది సరికాదు. లేదా అనుభవంతో పాఠాలు నేర్చుకున్న పెద్దల మాటలకైనా గౌరవం ఇవ్వాలి.

నిన్న మెదక్ జిల్లాలో సిద్ధిపేట నుంచి మాటుపల్లి గ్రామంలో అర్ధరాత్రి దిగి అక్కడినుంచి తన గ్రామానికి నడిచి వెళ్తోంది. ఆమె వివాహిత 24 సంవత్సరాల ప్రాయంలో ఉన్నది. ఆమెకు తెలిసిన మిదినాపూర్ కి చెందిన లష్కర్ కొండస్వామి మార్గం లో కలిసి తన స్కూటర్ మీద ఆమెను తీసుకెళ్ళి సాయం చేయటానికి ముందుకు వచ్చి, తీరా ఆమె ఎక్కిన తర్వాత ఆమెను మాటుపల్లి గ్రామ శివార్లలో బెదిరించి ఆమె మీద అత్యాచారం చేసాడు. ఆమె గ్రామానికి చేరుకుని జరిగిన విషయాన్ని తెలియజేయటంతో స్థానికులు పోలీసులకు రిపోర్ట్ నిచ్చారు.

బాధితురాలిని అందరూ గుచ్చిగుచ్చి అడగటమే కాదు పోలీసులకు విషయాన్ని తెలియజేసిన తర్వాత ఆమెను వైద్య పరీక్షల కోసం సిద్ధిపేట తీసుకెళ్ళటం వలన ఆమె మానసికంగానూ శారీరకంగానూ ఎంత క్షోభ పడివుంటుందో అర్థం చేసుకోవచ్చు.

lone-journey

మహిళ భద్రత కోసం పోలీసులు కూడా మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చెయ్యగూడదని, సాయంత్రం దాటిన తర్వాత నేరస్తురాలని అనుమానంతో మహిళను ప్రశ్నించటానికి పిలిపించగూడదనే నియమాలున్నప్పుడు, మహిళలు బయట కూడా తమ రక్షణ కోసం కొన్ని నియమాలను పెట్టుకోవటంలో తప్పు లేదు, అది వాళ్ళని అవమానించినట్టుగా భావించగూడదు. తెలిసిన వాళ్ళతోనైనా తమ జాగ్రత్తలో తాముండటం, నిర్మానుష్యంగా ఉండే చోటికి ఒంటరిగా పోకుండా ఉండటం ఇలాంటివి పాటించటం, వీలయినంత వరకు తమ కదలికలను ముందుగానే తమ ఇంటివాళ్ళకి చెప్పటం లాంటివి చేస్తే మహిళల మీద అత్యాచారాలు చాలా వరకు తగ్గిపోతాయి. తెలిసినవాళ్ళే కదా అని వాళ్ళ దగ్గర జాగ్రత్త తీసుకోకపోవటం సరికాదు. ఒకవేళ తెలిసిన వాళ్ళతోనే వెళ్ళవలసి వచ్చినా, ఆ విషయాన్ని కూడా ముందుగా వెళ్ళవలసిన చోటికి తెలియజేయవచ్చు. సెల్ ఫోన్లున్న ఈ కాలంలో కూడా సమాచారాన్ని అందజేయకుండా ఉండటమెందుకు?

కాకపోతే మా ఇష్టమైన దుస్తులు మేం ధరిస్తాం, మేము ఎక్కడికి పోయేది ఎవరికీ చెప్పవలసిన అవసరం లేదు, ఏ సమయంలోనైనా ఎక్కడైనా తిరుగుతాం మాకు ఆ హక్కు ఉంది అంటే, హక్కు గురించి కాదు, ఇక్కడ భద్రత ప్రధానం కదూ. అక్కడ బ్లాస్టింగ్ జరుగుతోంది, కొండ రాళ్ళు మీద పడతాయి పోకండి అంటే, నాకు చెప్పటానికి మీరెవరు, నాకు భారతదేశంలో ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛని కాలరాయకండి అంటే?

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrangement for ugadi at tirupati
Palwai alleges komatireddy brothers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles