83 dead in landslide in tibet

tibet landslide, gold mine in tibet, china national gold corporation, han chinese

83 dead in landslide in tibet

tibet-land-slide.png

Posted: 03/30/2013 02:56 PM IST
83 dead in landslide in tibet

land-slide-in-tibet

టిబెట్ లోని అతి పెద్ద బంగారు గనిలో కొండచరియలు కూలి పడడంతో 83 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఈ విషయాన్ని చైనా నడిపిస్తున్న టివి సంస్థ బయటపెడుతూ, 2000 మందితో కూడిన సహాయక బృందం భూమి లోపల ఇరుక్కుపోయినవారిని వెదకటానికి వస్తోందని తెలియజేసింది. నాలుగు చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో కొండరాళ్ళు, మట్టి, శిధిలాలు వెదజల్లబడివున్నాయి.

చైనా నేషనల్ గోల్డ్ కార్పోరేషన్ కి అనుబంధ సంస్థలో పనిచేస్తున్న ఈ సంస్థను టిబెట్ ప్రభుత్వం నడుపుతోంది. ఇందులో చనిపోయినవారిలో ఇద్దరు టిబెట్ దేశీయులు, మిగిలినవారు ప్రవాస హాన్ చైనీస్ ఉన్నారు. 30 ఎస్కవేటర్లు, పోలీసు, అగ్నిమాపక దళాలు, వైద్యబృందాలు, సైనికులు ఘటనా స్థలిలో జీవించివున్నవారి కోసం అన్వేషణ సాగించారు. అందుకోసం పరికరాలు, కుక్కలను ఉపయోగిస్తున్నారు.

ఇది ఒక ప్రకృతి వైపరిత్యమని, సహజంగా జరిగిన ఘటన అని అధికారులు అంటున్నారు. కానీ ప్రమాదం జరిగిన ఎన్నో గంటల తర్వాత విషయం బయటకు రావటం ఆశ్చర్యకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  China made stbs throng hyderabad markets
Agitations of tdp on electricity charges hike continues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles