Agitations of tdp on electricity charges hike continues

telugug desam party, electricity charges hike, tdp agitations continue, central energy officer bakshi

agitations of tdp on electricity charges hike continues

tdp-on-electricity.png

Posted: 03/30/2013 02:50 PM IST
Agitations of tdp on electricity charges hike continues

విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఆందోళన చేస్తున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ రోజు ఈఆర్ సి ఛైర్మన్ రఘోత్తమ రావు కి విద్యుత్ ఛార్జీలను పెంచరాదంటూ వినతిపత్రాన్ని ఇచ్చారు. దానిమీద ఆయన స్పందన కోసం తెదేపా నాయకులు పట్టుబట్టగా, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకూ తనేమీ చెప్పలేనని అన్నారు. ఈ విషయం మీద బహిరంగ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వాటిలో వచ్చిన అభ్యంతరాలను సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ మాటలకు తృప్తిపడని తేదేపా నాయకులు ఛార్చీలను పెంచటం లేదనే హామీని స్పష్టంగా ఇవ్వమని కోరుతూ ఈఆర్ సి ఛైర్మన్ కాబిన్ లో ఆందోళనకు దిగి బైఠాయించారు.

నిన్న అర్ధరాత్రి తెదేపా నాయకుల దీక్షకు భంగం కలిగిస్తూ వారిని హాస్పిటల్స్ కి తరలంచి బలవంతంగా వైద్యం చేయించటం మీద నిరసన తెలియజేస్తూ తెలుగు దేశం పార్టీ నాయకుడు తలసాని యాదవ్ నిర్వహించిన మౌన దీక్షలో నల్లగుడ్డ నోటికి కట్టుకుని తెదేపా నాయకులు ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నారు.

కేంద్ర ఇంధన శాఖాధికారి ఏ.ఎస్.భక్షి విద్యుత్ సమస్యను ఎలాగైనా అధిగమిస్తామని హామీ ఇస్తున్నారు. విద్యుత్ సౌధలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, గ్యాస్ సకాలంలో లభించకపోవటం, వర్షాలు సరిగ్గా కురవకపోవటం లాంటి కారణాల వలన విద్యుదుత్పత్తి తగ్గిపోవటం వలనే ఈ సమస్య ఏర్పడిందని, అయితే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటామని భక్షి చెప్పారు.

రాష్ట్రంలోని విద్యుత్ సమస్య మూడు నెలల్లో అంతరించిపోతుందని, అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని మంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు వరంగల్ లో అన్నారు. ప్రత్యామ్నాయంగా సౌరశక్తి వినియోగంతో వ్యవసాయం చేసుకునే రైతులకు రాయితీలు కూడా ఉంటాయని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  83 dead in landslide in tibet
Sri lakshmi in critical condition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles