Unregistered documents are only papers says sc

supreme court of india, punjab haryana high court, registration of documents, witnessed will

unregistered documents are only papers says sc

unregistered-documents.png

Posted: 03/29/2013 10:50 AM IST
Unregistered documents are only papers says sc

supreme-court-photo

స్థిరాస్థికి సంబంధించినంత వరకు రిజిస్టర్ కాకపోతే చట్టం దృష్టిలో దానికి విలువ లేదు. వీలునామా అనుకుందామంటే దాని మీద సాక్షి సంతకాలు లేవు కాబట్టి అది కేవలం ఒక కాగితం అంతే. దాని మీద ఆధారపడి చేసిన మరో వీలునామా నిరాధారమైనది కాబట్టి చెల్లదు అని నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ ఆర్.ఎమ్.లోధా, జస్టిస్ అనిల్ ఆర్.దావే ల ధర్మాసనం. ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం స్థిరాస్థి బదలాయింపును రిజస్టర్ చేసుకోవాలి. లేకపోతే అది చెల్లదంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు గజరాజ్ సింగ్ కేసులో లోగడ ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు బలపరచింది.

మార్చ్ 1981 లో చనిపోయిన గజరాజ్ సింగ్ తన ఆస్తి తను గాని తన భార్యకాని ఇద్దరి లో ఎవరు బ్రతికి ఉంటే వారికి చెల్లుతుందని రాసారు. ఆ తర్వాత జూన్ 1989 లో చనిపోయిన అతని భార్య సుమిత్రా దేవి ఆ ఆస్తి తన ఎనిమిది మంది కుమారులలో ఒకరైన నరేందర్ సింగ్ రావ్ కి చెందాలని వీలునామాను ఎగ్జిక్యూట్ చేసారు.

దీని మీద తీర్పునిచ్చిన ధర్మాసనం, మొదటి డాక్యుమెంట్ కేవలం ఒక కాగితంగా మాత్రమే పరిగణించబడుతుందని, దాని మీద ఆధారపడ్డ సుమిత్రా దేవి వీలునామా చెల్లదని, అందువలన ఆస్తిని తొమ్మిది భాగాలుగా చేసి అందులో రెండు భాగాలు నరేందర్ సింగ్ కి చెందుతుందని పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పులో లోపమేమీ లేదని తెలియజేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Good friday special prayers held all over the state
Explosion in highly populated sakinaka in mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles