Mla dharmapal apologizes for his remarks

mla rao dharmapal, dharmapal remarks, sports woman dress code, rao dharmapal apologizes

mla dharmapal apologises for his remarks

mla-apologies.png

Posted: 03/24/2013 10:15 AM IST
Mla dharmapal apologizes for his remarks

హర్యానా శాసన సభ్యుడు రావ్ ధర్మపాల్ కబడ్డీ కోచ్ కి సారీ చెప్పారు. అయితే తను ఆ విధంగా అనలేదని కూడా ఆయన అన్నారు.

protest-on-rao-dharmapal

క్రీడల్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే వారి డ్రస్ ఉంటుంది. టెన్నిస్ ఆడే వాళ్ళకు ఆడవాళ్ళయినా సరే ఆ క్రీడాసంస్థల నియమాన్ని పాటించి అటువంటి దుస్తులు ధరించవలసిందే. గురుగాఁవ్ ద్రోణాచార్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ వార్షికోత్సవాల సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ సభ్యుడు రావ్ ధర్మపాల్ స్టేజ్ మీద మహిళా కబడ్డీ కోచ్ దబాస్ తో ఇలా జీన్స్ షర్ట్ లో కాకుండా సాంప్రదాయ బద్ధంగా చీరలో వస్తే బావుంటుందని అన్నారని, ఆ మాటలకు వేదన చెందిన ఆమె అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోవటం పెద్ద సంచలానికి దారితీసింది. ఆమెను వెంటనే మేదాంత మెడిసిటీకి తరలించిన ఆమె భర్త వివేక్ దబాస్, ఎమ్మెల్యే వ్యాఖ్యలతో నే ఆమె మనస్తాపం చెంది పడిపోయిందని అన్నారు.

ఇంకోముందు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, ఒకరేమిటి అందరూ ఆయన మీద విరుచుకుపడ్డారు. వ్యతిరేక నినాదాలు, రాజీనామా చెయ్యమని డిమాండ్లు, ఒకటేమిటి వివిధ రకాలుగా ఆయనని అంటూ, పబ్లిక్ లో ఎలా వ్యవహరించాలో రాజకీయనాయకుడికి తెలియాలంటూ విమర్శిస్తూ నానా హంగామా జరుగుతున్న నేపథ్యంలో సంక్షోభానికి తెరదించుతూ రావ్ ధర్మపాల్ మహిళా కోచ్ దబాస్ కి క్షమాపణ చెప్పారు.

ఇక అంతా సమసి పోయిందిలే, ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి కదా అన్నారొక పోలీస్ ఆఫీసర్. తన మాటలలో తప్పేమీ లేదన్న ధర్మపాల్, తను అన్న మాటలను తిరిగి ఇలా చెప్పారు- నువ్వొక పెద్ద క్రీడాకారిణివమ్మా, చాలా పతకాలను, పురస్కారాలను సంపాదించుకున్నావు, నువ్వు సాంప్రదాయబద్ధంగా ఉంటే ఇంకా బావుంటుంది. ఇందులో తప్పేమీ లేదని, అయినా ఆమె మనస్తాపం పడటం వలన క్షమాపణ చెప్పానని అన్నారాయన.

ఇక్కడ గమనించాల్సినవి రెండు విషయాలు. ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే అనామకునితో ఏమీ మాట్లాడగూడదు. మీరు మంచి మాటలే అన్నా, ఆ హోరులో వినిపించదు కాబట్టి, కచ్చితంగా మీరు తిట్టారనే అనుకుంటారు. అందువలన డ్రస్ గురించి మాట్లాడినప్పుడు తప్పు పట్టారని అనుకునే అవకాశమే ఉందా సమయంలో.

రెండవది, ఆటలో ఉన్నప్పుడు వేసుకునే డ్రస్ ని స్టేజ్ మీద వేసుకుని రానక్కర్లేదు నిజానికి. కానీ తనెవరో స్పష్టంగా తెలియాలి కాబట్టి ఆమె అలా డ్రస్ వేసుకునుండవచ్చు. మరి రాజకీయ నాయకులు కానీ స్వామీజీలు కానీ ప్రత్యేకమైన వస్త్ర ధారణ ఎందుకు చేస్తారు. అలాగే అందరూ ఆమెను క్రీడాకారిణి గుర్తించటం కోసం ఆమె అలా డ్రస్ చేసుకునుండవచ్చు.

 

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అనే మాటలు మాత్రమే కాకుండా, ఆ సమయంలో ముఖంలో కనిపించే హావభావాలు, కేంద్రీకరించిన దృష్టి, గొంతులో వైవిధ్యం కూడా ఎన్నో విషయాలను చెప్తాయి కాబట్టి ధర్మపాల్ తన తప్పేమీ లేదనటం కూడా సరికాదు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak ex president started to karachi
22 year old girl gang raped by 3 teens  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles