Photo of satish of crpf jawans killed changed in the procession

suicide bomber in jammu kashmir, crpf, mandya district, procession of killed crpf jawan

photo of satish of crpf jawans killed changed in the procession

photo-changed.png

Posted: 03/15/2013 03:40 PM IST
Photo of satish of crpf jawans killed changed in the procession

satish-crpfబుధవారం శ్రీనగర్ లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మరణించిన ఐదుగురు కేంద్రీయ రిజర్వ్ పోలీసులలో కర్నాటక లోని ఆలంబాది గ్రామానికి చెందిన నారాయణ శెట్టి సావిత్రమ్మల కుమారుడు  27 సంవత్సరాల ఎన్.సతీష్ ఉన్నారు.  మాన్డ్యా జిల్లా అధికారులు సతీష్ అంత్యక్రియలకు ముందుగా ఊరేగింపును ఏర్పాటు చేసారు.  ఆ ఊరేగింపు మాన్డ్యానుంచి ఆలంబాది వెళ్ళవలసివుంది.  డెప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి బయలుదేరిన ఆ ఊరేగింపులో తీసుకెళ్తున్న ఫోటో సతీష్ కి బదులు అతని అన్న హరీష్ ఫోటోని పెట్టారు.  ఊరేగింపులో పాల్గొన్న ఆలంబాది వాసులు ఫొటోని గుర్తుపట్టి అది సతీష్ ది కాదని, అది అతని సోదరుడిదని చెప్పారు.  సతీష్ అన్న హరీష్ కూడా కేంద్రీయ రిజర్వ్ పోలీసు ఉద్యోగంలో మధ్యప్రదేశ్ లో పనిచేస్తున్నారు.  

డెప్యూటీ కమిషనర్ బి.ఎన్ కృష్ణయ్య ఆ తప్పు జిల్లా అధికారులది కాదని అన్నారు.  ఫొటో అడిగినప్పుడు అతని బంధువులు ఇచ్చిన ఫొటోనే తాము పెట్టామని చెప్పారు.

బెంగళూరు నుంచి మాన్డ్యాకు సతీష్ పార్థివ శరీరాన్ని తెల్లవారు ఝామున 3.00 తీసుకునివచ్చిన తర్వాత ఉదయం 6.00 వరకూ కోల్డ్ స్టోరేజ్ లో ఉంచటానికి ఒక హాస్పిటల్ యాజమాన్యం అంగీకరించకపోవటం దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ పట్ల జరిగిన మరో తప్పిదంగా భావిస్తున్నారు.  ఆ హాస్పిటల్ మీద చర్య తీసుకుంటామన్న మంత్రి రామదాస్, మాన్డ్యాలో సతీష్ కుటుంబీకులకు 2400 చదరపు అడుగుల జాగాని ఇస్తామని చెప్పారు.  

సైన్యంలో చేరాలని హిమాచల్ దగ్గర పనిచెయ్యాలని తనకి చిన్నప్పటి నుంచీ కోరికగా ఉండేదని ఆ కోరికను తన కొడుకులు ఇద్దరూ తీర్చారని, దేశం కోసం తన కొడుకు ప్రాణాలను వదలటం తనకు ఎంతో గర్వంగా ఉందని సతీష్ తండ్రి నారాయణ శెట్టి అన్నారు.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bitti mohantypng
No confidence motion notice accepted by ap speaker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles