Bitti mohantypng

bitti-mohanty.png

Posted: 03/15/2013 04:23 PM IST
Bitti mohantypng

bitti-forged-papers

కేరళలో రాఘవ రాజన్ గా అవతారమెత్తి బుద్ధిమంతుడిలా ఉద్యోగం చేసుకుంటున్న బిట్టీ మొహంతి, నేను రాఘవ రాజన్ ని అయితే బిట్టీ అంటారేం అంటూ బుకాయించాడు.  కానీ పోలీసులు తమదైన శైలిలో చేసిన దర్యాప్తులో నిజం బయటపడింది.  అతని బి.టెక్ సర్టిఫికేట్లు దొంగ కాగితాలని తెలిసిపోయింది.

రాజస్తాన్ లో డిసెంబర్ 2006 లో తన తోటి బిటెక్ విద్యార్థిని, జర్మనీ దేశస్తురాలి మీదలో అత్యాచారం చేసి పట్టుబడి, ఆరు నెలలు జైలు వాసం చేసి, అమ్మకు బాగోలేదన్న వంకతో పెరోల్ మీద ఒరిస్సాకి పోతానని చెప్పి, తండ్రి హామీ మీద జైలు నుంచి బయటపడి ఎవరికీ దొరకకుండా తప్పించుకుని, అనుకోకుండా కేరళలో బ్యాంక్ ఉద్యోగిగా పట్టుబడ్డ బిట్టీ మొహంతి ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడున్నాడు ఏం చేసాడు అని విచారిస్తే, పుట్టపర్తిలో కొన్నాళ్ళుండి రాఘవ రాజన్ గానూ, బిటెక్ చదివిన వాడిలా దొంగ సర్టిఫికేట్లను సృష్టించుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ లో ఉద్యోగం సంపాదించుకున్నాడని తెలిసింది.

రేపిస్ట్ ల ఫోటోలలోని బిట్టీ మొహంతిని చూసి రాఘవ రాజన్ గా గుర్తుపట్టిన ఒక అఙాత వ్యక్తి ఇచ్చిన ఆధారంతో బిట్టీ పట్టుబడ్డాడు.  బ్యాంక్ లో కూడా అతనివి దొంగ సర్టిఫికేట్లనే అనుమానం వచ్చి అతని మీద ఫిర్యాదు కూడా వెళ్ళింది.  అన్నీ కలిపి బిట్టీ దొరికిపోయి కూడా కాదు, తను రాఘవ రాజన్ అనే బుకాయించటం మొదలుపెట్టాడు.  అయితే పూర్తిగా దర్యాప్తు చేసిన పోలీసులకు, కెఐఐటి విశ్వవిద్యాలయం ఇచ్చిన బిటెక్ సర్టిఫికేట్ నిజానికి బిట్టీ పేరు మీద జారీ చేసినదని, దాన్ని రాఘవ రాజన్ గా ఫోర్జరీ చేసాడని తెలిసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big hoardings of leaders in mumbai
Photo of satish of crpf jawans killed changed in the procession  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles