Supreme court gave green signal to panchayat elections

panchayat elections, local bodies, supreme court, reservations to bc sc st

supreme court gave green signal to panchayat elections

panchayat-elections.png

Posted: 02/18/2013 05:40 PM IST
Supreme court gave green signal to panchayat elections

     రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు సుప్రీం కోర్టు ఈ రోజు ఉదయం అనుమతినిచ్చింది.  2006లో జరిగిన ఎన్నికలలో పాటించిన రిజర్వేషన్ విధానాన్నే ఇప్పుడూ పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు యాభై శాతానికి మించగూడదని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన నిర్ణయం మీద సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ, బిసి లకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం కేటాయించాలని సుప్రీం కోర్టు తెలియజేసింది. 

     రిజర్వేషన్ విధానం 2006 లో పాటించినట్లుగానే కొనసాగుతుంది కానీ 2001 లో తీసుకున్నజనాభా లెక్కలు ఎన్నికలకు ఆధారమౌతాయి.  దీని వలన బిసిలు నష్టపోతారని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తన అభిప్రాయాన్ని, వేదనను వెలిబుచ్చారు. 

     ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతి లభించినందుకు కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు.  ఎన్నికలు నిలిచిపోయినందువలన కేంద్రం జారీ చెయ్యవలసిన నిధులు 2400 కోట్ల వరకూ ఆగిపోయాయని ఆయన తెలియజేసారు.  ఎన్నికల అనంతరం ఆ నిధులను రాష్ట్రానికి అందజేస్తామని ఆయన హామీ ఇస్తూ, ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్ భవిత ఆధారపడివుంటుందని తాను అనుకోవటం లేదని ఆయన చెప్పారు.  అయితే అందుకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, స్థానికి ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా భావించాలన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sbi bank golmaal in visakhapatnam
Suicide bomb squad attack at peshavar pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles