Aadhar cards service started in meeseva centers

aadhar cards, mee seva centers, cooking gas, aadhar card for fertilizers

aadhar cards service started in meeseva centers

aadhar-service.png

Posted: 02/18/2013 02:47 PM IST
Aadhar cards service started in meeseva centers

aadhar

     దేశవ్యాప్తంగా జారీ చేసే గుర్తింపు కార్డు అవటం వలన జాప్యం జరగటం సహజమే. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు కార్డులు ఉండబట్టి ఎక్కువగా పట్టించుకోని జనానీకం ఒక్కసారిగా ఆధార్ కార్డ్ గురించి ఆరాటపడటానికి కారణం వంటగ్యాస్ సబ్సిడీతో దాన్ని లింకుపెట్టటమే. ఆధార్ కార్డ్ కోసం అప్లికేషన్ ఫారాన్ని తీసుకున్న దగ్గర్నుంచీ ఢిల్లీ నుంచి కార్డ్ వచ్చేంత వరకూ అడుగడుగునా ఏదో విధంగా ఆలస్యం జరుగుతూ వివిధ రూపాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఆధార్ ని వ్యవసాయదారులు ఎరువులు తీసుకోవటంతోనూ ముడిపెట్టపోతున్నారట. దానితో ఆ కార్డ్ అవసరం అందరికీ బాగా కనిపిస్తోంది.కుటుంబ వివరాలన్నీ ఇచ్చినా కార్డ్ లభించక ఏం చెయ్యాలో తెలియక కొట్టమిట్టాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సమస్యలు తీరితే కానీ కచ్చితంగా ఆధార్ కార్డ్ అమలు చెయ్యటం కష్టమైన పని. పరిస్థితులకు తలవొగ్గి నియమాలను సడలించినట్లయితే మళ్ళీ ఇప్పట్లో పునరుద్ధరించటం జరగని పని. ద్విచక్రవాహనదారుల హెల్మెట్ ఆవశ్యకతలా నెమ్మది నెమ్మదిగా నీరుకారిపోతుంది.

     దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపు కార్ఢు, దానితోనే బ్యాంక్ లావాదేవీలు చెయ్యడం లాంటివి దేశ భద్రతా దృష్ట్యా అత్యంత ఆవశ్యకం. అందువలన ప్రభుత్వం సత్వర ఆధార్ సహాయం కోసం చర్యలు తీసుకోవటం ప్రశంసనీయం.మీసేవా కేంద్రాలలో ఆధార్ సహాయ సేవలను ప్రారంభించారు. ఖైరతాబాద్ లోని మీ సేవా కేంద్రంలో ఆధార్ సేవలను ప్రారంభించిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, ఈ సేవ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న 6000 మీ సేవా కేంద్రాలలో 3229 కేంద్రాలలో ఆధార్ నమోదుకి ఏర్పాట్లున్నాయని, మిగిలిన కేంద్రాలలో కూడా త్వరలో ఈ వెసులుబాటు కలిగిస్తామని పొన్నాల తెలియజేసారు.

     ముందే నమోదు చేసుకుని కార్డ్ పొందినా దాన్ని పోగొట్టుకున్నవారు, నమోదు చేసుకున్నా కార్డ్ పొందనివారు ఈ కేంద్రాలలో తిరిగి ఆధార్ నంబరుని పొందే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High court issued notice to ttd and state govt
Last statement of afjal guru indicates pride  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles