Chandrababu naidu completes two thousand kilometers

chandrababu naidu, vastunna meekosam padayatra, completes two thousand kilometers in guntur district,

Chandrababu Naidu completes two thousand kilometers

Chandra-babu-Naidu.gif

Posted: 02/12/2013 07:38 PM IST
Chandrababu naidu completes two thousand kilometers

Chandrababu Naidu completes two thousand kilometers

 తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయకుడు  చేపట్టిన  ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర  గుంటూరు  జిల్లాలో రెండు వేల కిలోమీటర్ల మైలు రాయి దాటింది.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా  శ్రేణులు సంబరాలు  జరుపుకొంటున్నాయి. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ, వైద్యులు పాదయాత్ర వద్దని చెప్పినప్పటికీ నిరంతరాయంగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడు రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు.  గుంటూరు నగరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ సర్కిల్‌ చేరుకునే సరికి రెండు వేల కిలో మీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్‌ కట్‌ చేశారు. గత ఏడాది అక్టోబరు 2వ తేదీన బాబు అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆయన 12 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం 13వ జిల్లాలో యాత్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు 107 పట్టణాలు, రెండు నగరాలు, 107 మండలాలు, 55 నియోజకవర్గాల మీదుగా బాబు పాదయాత్ర చేశారు. మధ్యలో మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల వద్ద వేదిక కూలినప్పుడు, ఎర్రన్నాయుడు చనిపోయిన సమయంలో , తుఫాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు మినహా మరెక్కడా పాదయాత్ర ఆగలేదు. అనారోగ్యంతో నాలుగు రోజుల పాటు కృష్ణా జిల్లాలో పాదయాత్ర శిబిరంలోనే విరామం తీసుకున్నారు. అప్పుడు కూడా ప్రజా సమస్యలపై ఆయన పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dadi veerabhadra rao comment on bandla ganesh
Return his body no other demands from govt afzal guru family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles