Telangana heat andhra cm meets sonia

telangana statehood issue, n kiran kumar reddy, k rosaiah, sonia gandhi, sushilkumar shinde

Telangana statehood issue: Andhra Pradesh CM N Kiran Kumar Reddy met Congress President Sonia Gandhi at her residence in New Delhi

Telangana heat-Andhra CM meets Sonia.png

Posted: 02/05/2013 09:42 AM IST
Telangana heat andhra cm meets sonia

kiranఅధిష్టానం పిలుపు అందుకొని ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని పెద్దలతో పాటు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా చర్చల్లో బిజీగా గడిపారు. ముఖ్యంగా తెలంగాణ పై చర్చించినట్లు సమాచారం. అయితే కిరణ్ మేడమ్ కి తెలంగాణ పై ఏం చెప్పాడు ? అధిష్టానం మాటే నా మాట అని చెప్పే  కిరణ్ నిన్న అమ్మ చెవిలో ఏం చెప్పాడు. మనకందిన సమచారం ప్రకారం.... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే.... రాష్ట్రం సమస్యల పుట్టలాగా మారుతుందని, పార్టీకి రాజకీయంగా మేలు జరగకపోగా.. మరింత నష్టపోయే అవకాశాలున్నాయని హెచ్చరించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడం అంత సులభం కాదని, అనేక చిక్కుముళ్లను విప్పాల్సి ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానానికి సీఎం కిరణ్ వివరించినట్లు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించిన తర్వాత రాజకీయంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న నమ్మకం లేదని, అనేక కొత్త సమస్యలు తలెత్తవచ్చని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దెబ్బతీసే అవకాశాలూ ఉన్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పార్టీ పెద్దలకు కిరణ్ వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చెక్కుచెదరలేని ప్రస్తుతం జరుగుతున్న సహాకార ఎన్నికలతో రుజువైందని మేడంతో చెప్పారు. ఈ విషయంలో మేడమ్ కిరణ్ ని అభినందించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dimple becoming sensation on face book
Sonia feed back from rosaiah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles