Book chidambaram shinde for cheating on telangana

Telangana Andhra Pradesh, P Chidambaram, Sushilkumar Shinde

A court in Andhra Pradesh on Monday directed the state police to register a case against two UPA government ministers for giving false assurances to the people of Telangana on the issue of its statehood

Book Chidambaram, Shinde for cheating on Telangana.png

Posted: 01/28/2013 09:44 PM IST
Book chidambaram shinde for cheating on telangana

Chidambaram-Sushilkumar_Shindeకేంద్రమంత్రులు షిండే, చిదంబరంలపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వారు తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణ అడ్వకేట్‌ సంఘం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్‌ పోలీసులను కోర్టు ఆదేశించింది. చిదంబరం కూడా తెలంగాణపై 2009 డిసెంబరు 9న ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు అనుకూలమని ఆయన నాడు ప్రకటించారు. తిరిగి 23న యూటర్న్‌ తీసుకున్నారు. గత నెల 28న తెలంగాణపై షిండే అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం ఆయన తీసుకున్నారు. నెల లోపుగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈమేరకు మీడియాతో కూడా మాట్లాడారు. తెలంగాణపై ఇదే చివరి సమావేశమని కూడా చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌ తెలంగాణపై అనేక తర్జనభర్జనలు చేసింది. ఈ అంశంపై యూ టర్న్‌ తీసుకుంది. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం మళ్లీ సంప్రదింపులు అవసరమని ప్రకటించింది. ఈమేరకు ఆదివారం కేంద్రమంత్రులు షిండే, ఆజాద్‌లు మీడియాతో మాట్లాడారు.

అందరితో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని ఆజాద్‌ ప్రకటించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు మరింత గడువు పడుతుందని షిండే చెప్పారు. షిండే చెప్పిన నెల గతంలోకి వెళ్లిపోవడం, నెలకు, వారానికి రోజుల లెక్కకట్టిన ఆజాద్‌ తదితర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ ఉద్యమం రాజుకుందిషిండే ప్రకటనపై భగ్గుమన్న న్యాయవాదుల సంఘం రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్‌ పోలీసులను ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrcp leader roja arrested
Telangana congress mps resignation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles